Asianet News TeluguAsianet News Telugu

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి బస్సు రూట్ మార్పు కూడ ప్రధాన కారణమని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు

kondagattu accident:  RTC officers changs bus route
Author
Kondagattu, First Published Sep 11, 2018, 1:59 PM IST


జగిత్యాల: కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి బస్సు రూట్ మార్పు కూడ ప్రధాన కారణమని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు.  బస్సులో సుమారు 62 మందికిపైగా ఉన్నారని సమాచారం.

శనివారపేట నుండి బస్సు బయలుదేరిన కొద్దిసమయంలోనే ఈ బస్సు ప్రమాదానికి గురైంది.  శనివారపేట నుండి జగిత్యాలకు  షటిల్  సర్వీసు బస్సు ఇది. అయితే వారం రోజులుగా ఈ బస్సును వేరే రూట్‌లో బస్సును మళ్లిస్తున్నారని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు.ఆదాయం కోసం కొండగట్టు మీదుగా బస్సును నడిపిస్తున్నారని సమాచారం. 

గతంలో మాదిరిగానే ఈ బస్సు యధావిధిగా రూట్ లో నడిపిస్తే  ఈ ప్రమాదం తప్పేదని  భావిస్తున్నారు. బస్సు ప్రయాణిస్తున్న మార్గంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బస్సు దారి తప్పి ఘాట్‌ మార్గంలోకి వచ్చిందని.. అసలు ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణించే అవకాశమే లేదని స్థానికులు చెబుతున్నారు.

అందువల్ల ఆర్టీసీ బస్సులు ఈ మార్గంలోకి రావని మంత్రి ఈటల రాజేందర్ కూడ అభిప్రాయం కూడ అనుమానం వ్యక్తం చేయడం కూడ గమనార్హం. అయితే ఈ బస్సు ఈ రూట్‌లో ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.


ఈ వార్తలు చదవండి

కొండగట్టు ప్రమాదం: యాక్సిడెంట్‌‌కు కారణమిదే..!

కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా: 43 మంది మృతి

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహాదారిపైకి.. ఇంతలోనే ఇలా..

Follow Us:
Download App:
  • android
  • ios