తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి ఘోరమైన బస్సు ప్రమాదంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రమాదం నిలిచింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో చాలామంది ప్రయాణికులు  మృత్యువాతపడగా మరొకొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు క్షతగాత్రులు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మృతుల సంఖ్య 62కు చేరింది. ఇలా కిక్కిరిసిన ప్రయాణికులతో కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆర్టీసి బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి 62 మంది అమాయకులను బలితీసుకుంది. 

గత నెల రోజుల నుండి కొండగట్టు బస్సులను సాధారణంగా మార్గంలో కాకుండా వేరే రూట్ లో నడుపుతున్నారు. ఇలా ఘాట్ రోడ్డుపై కండీషన్ సరిగ్గా లేని బస్సు ఓవర్ లోడ్ తో వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలోనే చాలామంది మృతిచెందారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 ఇలా చికిత్స పొందుతున్న వారిలో ఇవాళ మరో ఇద్దరు మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్, ఎంపి వినోద్ లు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరపున 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

కొండగట్టు: ప్రమాదానికి ముందు డ్రైవర్ ఏం చెప్పాడంటే?

కొండగట్టు ప్రమాదం: స్టీరింగ్ విరిగి... బ్రేకులు ఫెయిలైనా.. డ్రైవర్ చివరి యత్నాలు

కొండగట్టు ప్రమాదాలు: అప్పట్లో వైఎస్, చంద్రబాబు ఇలా...