జగిత్యాల: కొండగట్టులో ప్రమాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా భారీ ప్రమాదాలు జరిగి, పెద్ద యెత్తునే ప్రాణ నష్టం జరిగింది. కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో 2004 లో వాటర్ టాంక్ కూలి సుమారుగా 20 మంది మరణించారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వెంటనే అక్కడకు వచ్చి బాధితులను పరామర్శించారు.

గతంలో ఓసారి రామడుగు మండలంలోని వేదిర లోని మాతా స్కూల్ బస్ బావిలో పడి 15 మంది పైగా పిల్లలు మరణించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. 

తాజాగా బస్సులో లోయలో పడి 60 మంది మరణించారు. మంత్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం రాలేదు.

కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత ఘటనపై  గురువారం హన్మకొండలోని కొత్తబస్టాండు కు కూతవేటు దూరంలో ఉన్న పద్మాక్షి గుట్ట ముందు గుండం దగ్గర "కొవ్వత్తులతో నివాళి " అర్పించడానికి కవులు, కళాకారులు పూనుకున్నారు. సాయంత్రం.6గంటలకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ ఉంట్ుందని పద్మాక్షి గుట్ట వాకర్స్ అసోషియేషన్, వరంగల్ రచయితల సంఘం తెలిపింది.

ఈ వార్తాకథనాలు చదవండి

కొండగట్టు ప్రమాదం: 60 కోతులు చనిపోయిన రెండు రోజులకే ఇలా....

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు ప్రమాదానికి కారణమిదే: బట్టబయలు చేసిన కండక్టర్

కొండగట్టు ప్రమాదం...బస్సు నడిపింది ఈ ఉత్తమ డ్రైవరే...

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...

కొండగట్టు బస్సు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే యాక్సిడెంట్