హైదరాబాద్:  కొండగట్టు వద్ద ప్రమాదానికి గురైన సమయంలో బస్సు సుమారు 60 నుండి 70 కి.మీ స్పీడ్‌లో ఉందని ప్రత్యక్ష సాక్షి బస్సు కండక్టర్ పరమేశ్వర్ చెప్పారు. ఘాట్ రోడ్డు చివరి మలుపు  వద్ద బస్సును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయినట్టు పరమేశ్వర్ అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు కొండగట్టు  వద్ద బస్సు ప్రమాదానికి గురైన సమయంలో  బస్సులో  సుమారు  105 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు.  ఈ ప్రమాదంలో 60 మంది మృత్యువాతపడ్డారు.వీరిలో 36 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు. ఇంకా 20 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

కొండగట్టుపైకి బస్సు  వెళ్లే సమయానికి  సుమారు 96 మందికి టిక్కెట్లను ఇచ్చినట్టు కండక్టర్ పరమేశ్వర్ చెప్పారు. కొండగట్టుపై  ఎక్కిన  ప్రయాణీకుల టిక్కెట్లు ఇంకా తీసుకోలేదని పరమేశ్వర్ చెప్పారు. కొండగట్టుపై  సుమారు  నలుగురు ప్రయాణీకులు ఎక్కారని  ఆయన గుర్తుచేసుకొన్నారు.

కొండగట్టు ఘాట్ రోడ్డుపై నుండి కిందకు దిగుతున్న సమయంలోనే బస్సు  అతి వేగంగా ముందుకు వెళ్లిందన్నారు.  మూలమలుపు వద్ద కూడ బస్సు వేగం ఏ మాత్రం తగ్గలేదన్నారు. ఆ సమయంలో బస్సు కనీసం 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో  ప్రయాణించి ఉంటుందని  పరమేశ్వర్ చెప్పారు.

ఈ రూట్‌లో  వేరే బస్సులు లేవు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ బస్సును ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉంటాయని ఆయన చెప్పారు. జెఎన్టీయూ వరకైనా వచ్చేందుకు ప్రయాణీకులు ఈ బస్సును ఆశ్రయిస్తారని ఆయన తెలిపారు. 

బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయా... లేదా బస్సును న్యూట్రల్ ‌లో నడిపాడా అనేది తనకు తెలియదన్నారు. కనీసం హ్యాండ్ బ్రేక్ వేసినా బస్సు ఆగేదన్నారు. కనీసం బస్సు ఎందుకు  ఆపలేకపోయాడో అర్థం కాలేదన్నారు. రెప్పపాటులోనే  బస్సులోని ప్రయాణీకులంతా టాప్‌కు గుద్దుకొంటూ  బస్సులో ముందుకు దూసుకు వెళ్లినట్టు చెప్పారు. బస్సులో ఎక్కువ ప్రయాణీకులను తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో నెల రోజుల నుండే బస్సును కోండగట్టు ఘాట్ నుండి మళ్లించారని పరమేశ్వర్ చెప్పారు.

ఆర్టీసీ చరిత్రలో ఈ బస్సు ప్రమాదమే అత్యంత పెద్దదిగా చెబుతున్నారు.ఇంత ఘోరమైన ప్రమాదం ఎప్పుడూ కూడ జరగలేదంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బస్సులో కనీసం 40 మంది ప్రయాణించవచ్చు. అయితే పరిమితికి మించి బస్సులో  ప్రయాణీకులను  ఎక్కించడం కూడ ప్రమాదంలో ఎక్కువ మంది మృతికి కారణమైంది.

ఈ వార్తలు చదవండి

కొండగట్టు ప్రమాదానికి కారణమిదే: బట్టబయలు చేసిన కండక్టర్

కొండగట్టు విషాదం: ఐస్‌బాక్స్‌లో శవాన్ని పెట్టేందుకు డబ్బులు లేక.. ఐస్‌గడ్డలపై వరిపొట్టు పోసి

కొండగట్టు ప్రమాదం...బస్సు నడిపింది ఈ ఉత్తమ డ్రైవరే...
కొండగట్టు బస్సు ప్రమాదం...మృతులు వీరే

కొండగట్టు ప్రమాదం: యాక్సిడెంట్‌‌కు కారణమిదే..!

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు బస్సు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే యాక్సిడెంట్