Asianet News TeluguAsianet News Telugu

వ్యభిచారం ముసుగులో యువకులకు వలవేసి దోపిడి.. ముగ్గురు కిలేడీలు అరెస్ట్..

అబ్బాయిలకు వలవేసి.. వారిని నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Extortion of young man under the prostitution, three women arrested in warangal - bsb
Author
First Published Jan 24, 2023, 11:12 AM IST

వరంగల్ : వ్యభిచారం ముసుగులో యువకులకు వలవేసి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు కిలాడీ మహిళల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాలు తెలియజేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన విజయకుమార్ నిందితుడు.. అతను.. నూనె స్వప్న, కేసముద్రంకు చెందిన కోడం స్వరూప, పర్వతగిరికి చెందిన రాయపురం సరిత  అనే ముగ్గురు మహిళలతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.  ఈజీగా డబ్బు సంపాదించాలని వీరు ప్రణాళికలు వేశారు.

దీనికోసం అమాయక యువకులను టార్గెట్ చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ ముగ్గురు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి బస్టాండ్లలో మాట వేసేవారు. అమాయకులైన యువకులను గమనించి వారిని తమ సైగలతో ఆకర్షించేవారు. వీరి ఆకర్షణలో పడ్డారని నిర్ధారించుకున్న తర్వాత వారిని ఒక వాహనంలోకి ఎక్కించేవారు. అలా వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లేవారు.  అలా వెళుతున్న సమయంలో విజయ్ కుమార్ కు ఫోన్ చేసేవారు. మీరు అక్కడికి వచ్చేసరికే విజయ్ కుమార్ రెడీగా ఉండేవాడు. అలా వాహనంలోని వ్యక్తిని బెదిరించి దోపిడీకి పాల్పడేవారు. 

మహబూబ్ నగర్ లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు: కీలకాంశాలపై చర్చ

ఇప్పటికే మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. పరిధిలో మరో కేసు నమోదు అయింది.  మొదటి రెండు కేసుల్లో రూ. 20వేల నగదు, సెల్ఫోన్ పోగా..  మూడో కేసులో రూ. 3000, సెల్ ఫోన్ ను బలవంతంగా లాక్కున్నారు.  ఈ మేరకు ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఈ ముఠా మీద ప్రత్యేకంగా పెట్టారు. ఈ క్రమంలోనే మామునూరు ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్  సోమవారం తన సిబ్బందితో కలిసి రాంగోపాల్ పురం వద్ద నిందితురాలను అదుపులోకి తీసుకున్నారు.

నిందితురాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఏసీబీ నరేష్ కుమార్, ఎస్సై రాజిరెడ్డి,  కానిస్టేబుల్ సర్దార్ భాష, రోజాలకు ఈస్ట్రోన్ డిసిపి అభినందనలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios