రేవంత్... చీర నువ్వు కట్టుకుంటావా, రాహుల్ తో కట్టిస్తావా..: కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ ముుఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మధ్య ఓ ఆసక్తికర ఛాలెంజ్ సాగుతోంది. వీరి ఒకరికొకరు చీరకట్టు ఛాలెంజ్ విసురుకున్నారు...

BRS Working President KTR Strong Counter to CM Revanth Reddy  AKP

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రధానపార్టీల నాయకులు జోరుగా ప్రచారం చేపడుతూ ఒకరిపై ఒకరు మాటలయుద్దానికి దిగుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ విసురుకున్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ హయాంలో తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ది ఏమీ లేదని కేటీఆర్ అంటే... తమ హయాంలోనే ప్రజలకు సుపరిపాలన అందుతోందని, రాష్ట్ర అభివృద్ది జరుగుతోందని రేవంత్ అంటున్నారు. ఈ క్రమంలోనే   ఇద్దరి మధ్య చీరకట్టు ఛాలెంజ్ మొదలయ్యింది. 

ఏమిటీ చీరకట్టు ఛాలెంజ్ : 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా  రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఏ ప్రచార సభలో మాట్లాడినా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై విరుచుకుపడుతున్నారు. ఇలా తెలంగాణలో ఇప్పటివరకు కాంగ్రెస్ చేసిన అభివృద్ది, ప్రజాసంక్షేమం ఏమీ లేదన్న కేటీఆర్ మాటలకు స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. ''సినిమా పరిశ్రమవాళ్ళు నీకె బాగా తెలుసుకదా...మంచిగా చీర కట్టుకుని ఆడపిల్లలా తయారయి ఆర్టిసి బస్సు ఎక్కు... ఒకవేళ నీకు టికెట్ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు చేయనట్లే'' అంటూ కేటీఆర్ కు సీఎం కౌంటర్ ఇచ్చారు. 

ఇక రేవంత్ వ్యాఖ్యలకు అంతే ఘాటుగా కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ''రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే'' అంటూ ఎక్స్ వేదికన మండిపడ్డారు కేటీఆర్. 

''డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం. కేసిఆర్ కిట్ ఆగింది,న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి. అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్ కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది'' అంటూ సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios