యాదాద్రి: తెలంగాణలో కనీస మానవత్వం లేకుండా రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డమ్మీ హోం మినిష్టర్ తో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. 

యాదాద్రి జిల్లా బొమ్మలరామారంను సందర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే బాలికలు దారుణంగా హత్యకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. 

రాష్ట్రంలో ఇంటర్ పిల్లలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్న సీఎం కేసీఆర్ గానీ హోం మినిష్టర్ మహమ్మూద్ అలీ గానీ స్పందిచకపోవడం దురదృష్టకరమన్నారు. కనీసం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి స్పందిచడం లేదని విమర్శించారు. 

ఇప్పటికైనా పోలీస్ శాఖ నిర్లక్ష్యం విడనాడాలని డిమాండ్ చేశారు. పదోతరగతి విద్యార్థి శ్రావణి మృతదేహం తీసిన రోజే కాస్తా లోతుగా పరిశీలించి ఉంటే మనీషా హత్య కూడా బయటకు వచ్చేదన్నారు. ఈ ప్రాంతంలో గంజాయి దందా జోరుగా సాగుతున్న పోలీసులు శ్రద్ద పెట్టడం లేదని విమర్శిస్తున్నారు. 

పెద్ద ఎత్తున యువత మత్తుకు బానిసై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జిల్లాలో నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మృతుల కుటుంబాలను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 

ఈ వార్తలు కూడా చదవండి

నిందితుడు శ్రీనివాసరెడ్డిని తప్పించేందుకు రాజకీయ కుట్ర : మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

ఇంకెప్పుడు స్పందిస్తారు, దారుణాలు కనబడటం లేదా: కేసీఆర్ పై మాజీమంత్రి కోమటిరెడ్డి ఫైర్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్త