బొమ్మలరామారం: పదోతరగతి విద్యార్థిని శ్రావణి, డిగ్రీ విద్యార్థిని మనీషా హత్యల కేసుల్లో కీలక నిందితుడు శ్రీనివాసరెడ్డికి రాజకీయ అండ ఉందని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఇప్పటికే రాజకీయంగా పైరవీలు చేపట్టినట్లు తెలుస్తోందని ఆయన ఆరోపించారు. 

నిందితుడుకు ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా వదలొద్దని అతడిని ఉరితియ్యాలని డిమాండ్ చేశారు. హజీపుర్ లో కలకలం రేపిన హత్యల ఘటనపై తెలుసుకున్న మోత్కుపల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల  కుటుంబాలను ఓదార్చారు. 

అనంతరం హత్యలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యువతులపై అత్యాచారాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం ఇకనైనా స్పందించి వారికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఇంకెప్పుడు స్పందిస్తారు, దారుణాలు కనబడటం లేదా: కేసీఆర్ పై మాజీమంత్రి కోమటిరెడ్డి ఫైర్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్త