యాదాద్రి: యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రావణి అనే బాలిక దారుణ హత్యకు గురైంది. స్పెషల్ క్లాస్ ఉందంటూ ఈనెల 24న శ్రావణి ఇంటి నుంచి వెళ్లింది. 

అయితే ఎంతసేటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అంతా చూశారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

అయితే హజీర్ పూర్ సమీపంలోని నిర్మానుష్యమైన ప్రాంతంలో ఓ పాడుబడ్డ బావి సమీపంలో శ్రావణికి సంబంధించి స్కూల్ బ్యాగ్ లభించింది. పక్కనే మూడు బీరు బాటిళ్లు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా పరీశిలంచగా బావిపక్కన యువతి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు గమనించారు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేప్రయత్నం చేశారు. 

మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. శ్రావణి హత్యకు గురవ్వడంతో ఆమె స్వగ్రామమైన హజీర్ పూర్ లో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే గ్రామస్థులు పోలీసులను ఘోరావ్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో భారీ బలగాలన మోహరించారు.