Asianet News TeluguAsianet News Telugu

మహిళలతో వ్యభిచారం.. ఆపై పథకం ప్రకారం గొంతు నులిమి హత్య.. నగదు, బంగారాలతో జల్సా.. దంపతుల ఘాతుకం..

ఓ దంపతులు జల్సాలకు అలవాటు పడి అత్యంత దారుణానికి తెగించారు. మహిళలను పిలిపించి వ్యభిచారం చేయిస్తూ.. వారి వద్ద డబ్బులు పోగవ్వగానే హత్యలు చేస్తున్నారు. 

couple murders prostitutes over money in kamareddy, arrest
Author
First Published Sep 22, 2022, 7:20 AM IST

కామారెడ్డి : డబ్బుల కోసం అతినీఛమైన పనికి ఓడిగట్టారు ఓ దంపతులు. మానాన్ని అమ్ముకుని బతికే వ్యభిచారులను అతి కిరాతకంగా చంపేస్తూ.. వారి వద్ద ఉన్న నగదు, నగలు దోచుకుంటూ జల్సాలు చేస్తున్నారు. వ్యభిచారం, దొంగతనాలకు అలవాటు పడిన భార్యాభర్తలు దురాశతో హత్యలకూ తెగించారు. మహిళలను పిలిపించి కొద్దిరోజులు వ్యభిచారం చేయించడం.. వారి వద్ద డబ్బులు పోగవ్వగానే హత్య చేసి సొమ్ము కాజేయడం వారి నైజం. చివరకు ఆ దంపతులు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో బయటపడిన దంపతుల ఆకృత్యాలను ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బుధవారం వెల్లడించారు. బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన దంపతులు వీరమల్లు రమేశ్, యశోద తాగుడుకు బానిసై దొంగతనాలు చేసేవారు. ఫంక్షన్ హాళ్లలో మహిళల సెల్ ఫోన్లు, ఆభరణాలు, నగదు  దొంగిలించేవారు. ఇలా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ లో చోరీ చేస్తూ దొరకడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కరీంనగర్‌లో దారుణం, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని.. యువకుడిపై కత్తులతో దాడి

మద్యం తాగించి హత్య..
ఆ తర్వాత జంగంపల్లి నుంచి కామారెడ్డికి మకాం మార్చిన దంపతులు పలువురు మహిళలతో వ్యభిచారం చేయించడం మొదలు పెట్టారు.  అత్యాశతో వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో నివసించే నరేష్ సాయంతో జూలై 5న ప్రమీల అనే మహిళను పిలిపించారు. మద్యం తాగించి మత్తులో ఉండగా ఆమె గొంతు నులిమి హత మార్చారు. ఆమె నుంచి రూ. 30వేల నగదు,  బంగారం, వెండి ఆభరణాలను తీసుకున్నారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి కారులో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి కాల్చివేశారు. ఈ నెల 7న వాణి అనే మహిళను ఇదేవిధంగా పిలిపించి హత్య చేశారు. మృతదేహాన్ని కారులో గాంధారి మండలం తిమ్మాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి డీజిల్ తో దహనం చేశారు.

పట్టించిన కారు..
దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దాని యజమానిగా భావిస్తున్న వీరమల్లు రమేష్ ను పట్టుకుని విచారించగా బండారం బయటపడింది.  అతడి భార్య యశోద, వారి వద్ద బంగారం, వెండి  ఆభరణాలు కొనుగోలు చేసిన పిన్నోజి రామును అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రెండు కార్లు, ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్ లతో పాటు రూ.5వేల నగదు, తులంన్నరకు పైగా బంగారం,  40 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమీల హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న నరేష్ కోసం గంభీరావుపేట పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios