Asianet News TeluguAsianet News Telugu

మందు బాబులకు బ్యాడ్‌న్యూస్.. వైన్సులు బంద్ ఎన్ని రోజులంటే..

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. మండుటెండల్లో చల్లని చల్లని బీర్లు తాగుతూ ఎంజాయ్ చేద్దాం అనుకున్న మందుబాబులకు షాక్ ఇచ్చింది.  

Telangana government order to close wine shops for 48 hours KRJ
Author
First Published May 10, 2024, 11:19 AM IST

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. మండుటెండల్లో చల్లని చల్లని బీర్లు తాగుతూ ఎంజాయ్ చేద్దాం అనుకున్న మందుబాబులకు షాక్ ఇచ్చింది.  పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  రెండు రోజులపాటు అంటే.. 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్టు తెలంగాణ సర్కార్ తెలిపింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ప్రకారం.. మే 11న శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమవారం సాయంత్రం 6 గంటల వరకు   మద్యం దుకాణాలను మూసివేయాలని  ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. వైన్ షాపులు,బార్లు మాత్రమే కాకుండా కల్లు కాంపౌండ్లు కూడా ఈ రెండు రోజులపాటు మూతవేయనున్నట్టు తెలిపింది.  అంతే కాదు.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజు కూడా వైన్ షాపులు,బార్లను బంద్ చేయనున్నట్టు పేర్కొంది. అంటే.. జూన్ 4న ఈ ప్రకటన అమల్లోకి వస్తుందన్న మాట.  

తెలంగాణ లో జరుగుతున్న ఎన్నిక లోక్ సభ ఎన్నికల ప్రచారం.. శనివారం సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుంది. అదే రోజు నుండి ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు మూతపడతాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు మద్యం పంపిణీ చేసే అవకాశాలు ఉన్నందున ప్రతి ఎన్నికల సమయంలో మద్యం దుకాణాలను మూసివేయడం అనవాయితీగా వస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మద్యం దుకాణాల మూసివేత కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అక్రమ లిక్కర్ కట్టడికి ఇప్పటికే పోలీసులు , టాస్క్ఫోర్స్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios