Asianet News TeluguAsianet News Telugu

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి. కొడంగల్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన ఆయన... నిరంకుశ అధికారంతో, నాలుగేళ్లపాటు ఫాంహౌస్‌లో ప్రశాంతంగా ఉన్న కేసీఆర్‌కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందన్నారు

Congress Leader Jaipal reddy comments on Revanth reddy arrest
Author
Hyderabad, First Published Dec 4, 2018, 11:50 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి. కొడంగల్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన ఆయన... నిరంకుశ అధికారంతో, నాలుగేళ్లపాటు ఫాంహౌస్‌లో ప్రశాంతంగా ఉన్న కేసీఆర్‌కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందన్నారు.

తనకు అడ్డుగా నిలుస్తున్న కొందరిపై కక్షగట్టి ఇబ్బందులుకు గురిచేస్తున్నారని జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి‌ని హింసించిన కేసీఆర్.. రేవంత్ రెడ్డిని కూడా అదే తరహాలో ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా... నీ కూతురు బెడ్‌రూమ్ బద్దలుకొట్టి పోలీసులు లోపలికి వస్తే కేసీఆర్ ఊరుకుంటారా అంటూ జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ అసలు బంద్‌కు పిలుపునివ్వలేదని.. కేవలం కొన్ని ప్రాంతాల్లో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి వచ్చేది కోస్గి వస్తున్నారని.. నిరసన కార్యక్రమాలు కోస్గికి అవతల పక్కన జరిపేందుకు కాంగ్రెస్ పిలుపునిచ్చిందన్నారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని.. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తామని జైపాల్ రెడ్డి వెల్లడించారు. 

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

Follow Us:
Download App:
  • android
  • ios