Asianet News TeluguAsianet News Telugu

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మారిన బిజెపి వ్యూహం, శ్రీకళారెడ్డిపై వెనక్కి....

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ శ్రీకళా రెడ్డి స్థానంలో మరో అభ్యర్ధి పేరును పరిశీలిస్తోంది. 

bjp plans to annaounce doctor ramarao name for huzurnagar by poll
Author
Huzur Nagar, First Published Sep 27, 2019, 12:04 PM IST

హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకొంది. స్థానికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న డాక్టర్ రామారావును బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో శ్రీకళా రెడ్డి పేరు వెనక్కు వెళ్లింది.

అక్టోబర్ 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ  ఎన్నికల్లో  టీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.  కాంగ్రెస్ నుండి ఈ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలను ప్రారంభించింది. కాంగ్రెస్ కూడ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది.

మరో వైపు  బీజేపీ కూడ ఈ స్థానం నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 1551 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటాకు 1600కు పైగా ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో భాగ్యారెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపింది.  ఈ దఫా శ్రీకళారెడ్డిని బరిలోకి దింపాలని  ఆ పార్టీ భావించింది.

అయితే ప్రస్తుత నియోజకవర్గంలో పెరిక సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలోకి దింపితే ప్రయోజనంగా ఉంటుందని  ఆ పార్టీ భావిస్తోంది.

ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు ఉన్న పెరిక సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రామారావు పేరును బీజేపీ పరిశీలిస్తోంది. దీంతో శ్రీకళా రెడ్డి పేరు వెనక్కు వెళ్లింది. మరో వైపు జైపాల్ రెడ్డి అనే వ్యక్తి పేరును కూడ బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. అయితే జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల ఏజంట్ గా కూడ పనిచేశారు. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను తెచ్చుకొంటే రానున్న ఎన్నికల్లో తమ పార్టీలోకి మరిన్ని వలసలు పెరిగే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తోంది.

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని  పలు మార్లు పలు పార్టీల నుండి ప్రయత్నించిన శ్రీకళారెడ్డికి ఈ దఫా కూడ నిరాశ తప్పేలా లేదు.డాక్టర్ రామారావు వైపే బీజేపీ నాయకత్వం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట అసెంబ్లీ స్థానం నుండి పెరిక సామాజిక వర్గానికి చెందిన దాసరి మల్లేశంకు బీజేపీ పలుమార్లు టిక్కెట్టు కేటాయించింది. అయితే ఈ స్థానం నుండి సీపీఐ అభ్యర్ధి గుర్రం యాదగిరిరెడ్డి, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిలు ప్రాతినిథ్యం వహించారు.

హుజూర్‌నగర్ లో ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు గాను  సామాజిక కోణాలను కూడ బీజేపీ నాయకత్వం పరిశీలిస్తోంది. గతంలో కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో అక్టోబర్ 24న తేలనున్నాయి.

 

సంబంధిత వార్తలు

ఉప ఎన్నిక: హుజూర్ నగర్ లో మోహరిస్తున్న గులాబీ దళాలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు...

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు..

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios