హుజూర్‌నగర్: అక్టోబర్ 21వ తేదీన జరిగే హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  పార్టీ ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతలను కేటాయించింది. ఒక్కో మండలానికి ఇంచార్జీలను నియమించింది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే  ఉప ఎన్నికను టీఆర్ఎస్,  కాంగ్రెస్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.దీంతో  ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు  హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్రీకరించారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రతి మండలానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలకు టీఆర్ఎస్ ఇంచార్జీలుగా బాధ్యతలను అప్పజెప్పింది.గురువారం నాడు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   సమావేశం అవుతారు. 

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ నేతలతో కేటీఆర్ చర్చించనున్నారు. హుజూర్‌,నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని  సీఎం కేసీఆర్ ఇంచార్జీగా నియమించారు.

ఈ నియోజకవర్గంలో ప్రచారంతో పాటు పార్టీ నేతల మధ్య సమన్వయంతో పాటు ఇతర అంశాలపై  పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షించనున్నారు.  మండలానికి నియమించిన ఇంచార్జీలతో కూడ రాజేశ్వర్ రెడ్డి సమన్వయం చేసుకోనున్నారు.

ఇక టీఆర్ఎస్‌కు ధీటుగా  కాంగ్రెస్ పార్టీ కూడ మండలానికి ఇంచార్జీలను నియమిస్తోంది.  మండలానికి నలుగురు అధికార ప్రతినిధులతో పాటు ఓ ఎమ్మెల్యేను ఇంచార్జీలుగా నియమించనుంది.

హుజూర్‌నగర్ దసరా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ప్రచారం నిర్వహించనుంది.  ఎన్నికలు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓబీసీ, ఎస్సీ సెల్ విభాగాలు హుజూర్‌నగర్ లోనే మకాం వేయనున్నాయి.


సంబంధిత వార్తలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు...

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు..

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి