బిజెపి శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సిఎం కేసిఆర్ కు షాక్ ఇచ్చేందుకు ఆయన రంగం సిద్ధం చేశారు. త్వరలోనే కేసిఆర్ గురించి సంచలన విషయాలు వెలగులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇంతకూ ఆ భారీ షాక్ ఏందబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి.. కింద వీడియో కూడా చూడండి.

బిజెపి రాష్ట్ర ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలను లేవనెత్తారు. కేసిఆర్ గడిచిన నాలుగేళ్ల కాలంలో సెక్రటేరియట్ కు ఎన్నిసార్లు పోయిండు... రాజ్ భవన్ కు ఎన్నిసార్లు పోయిండో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు పెట్టినట్లు చెప్పారు. ఆ వివరాలు రాగానే కేసిఆర్ బండారం బయటపెడతానన్నారు.

అంతేకాకుండా తెలంగాణలో తెలంగాణ పరిపాలనలో వ్యతిరేక శక్తుల  హస్తం ఉందని నిన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేసిన మాటలు వందశాతం నిజమన్నారు. కిషన్ రెడ్డి వీడియోలో మరిన్ని అంశాలు చూడండి.