న్యూఢిల్లీ:  చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షియోమీ తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మీ నోట్‌ 6 ప్రొ ధరను శాశ్వతంగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 6జీబీ ర్యామ్‌ విత్ 64జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం గల వేరియంట్‌ రెడ్‌మీ నోట్‌ 6ప్రొ ధరపై రూ. 2000 తగ్గించి వేసింది.

ఈ తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ప్రస్తుతం రూ. 13,999కు దిగి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐడాట్‌ కామ్‌తోపాటు, ఎంఐ స్టోర్లలో ఈ తగ్గింపు ధరలో లభిస్తుంది.  

దీంతోపాటు ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రిలయన్స్‌ జియో ద్వారా రూ. 2400 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. 6టీబీ డేటా ఆఫర్‌ ఉంది. ఎక్స్జేంజ్‌ ఆఫర్‌, నో కాస్ట్‌ ఈఎంఐ వసతి కూడా ఉంది. 

గత ఏడాది నవంబర్ నెలలో రెడ్ మీ నోట్ 6 ప్రో మోడల్ ఫోన్‌ను షియోమీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. అలాగే ఇదే ఫోన్ 4 జీబీ వేరియంట్‌ ఫోన్‌పై ఇప్పటికే శాశ్వత తగ్గింపును అందించిన సంగతి తెలిసిందే.  

రెడ్ మీ నోట్ 6 ప్రో లోని 4జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.11,999 ధర తగ్గించి వేసింది. దీనిపై రూ.2000 ధర తగ్గింది. 2019లో అత్యధికంగా అమ్ముడు పోతున్న ‘రెడ్ మీ నోట్ 6 ప్రో’ నిలిచింది. 

గతేడాది రెడ్ మీ నోట్ 6 ప్రో ఫోన్ విక్రయాల్లో మార్కెట్లో 4.8 శాతం వాటా పొందింది. 15 లక్షల ఫోన్లను విక్రయించామని షియోమీ తెలిపింది. క్వాడ్ కెమెరాతోపాటు ఫ్రంట్, బ్యాక్ వైపు రెండేసీ ఫోన్ల చొప్పున అమర్చారు. 

ఈ ఫోన్ 4జీ ఆఫర్‌తో కనెక్టివిటీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్ కలిగి ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్, 12 ఎంపీ ప్రైమరీ కెమరా, 12 ఎంపీ ప్రైమరీ విత్ ఎఫ్ 1.9 అపెచ్యూర్, 5ఎంపీ సెకండరీ కెమెరా డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్, రేర్ ఎండ్‌లో ఏఐ పోర్ట్రైట్ 2.0 ఉంటుంది. 

20ఎంపీ ప్రైమరీ సెన్సర్, సెల్ఫీల కోసం 2 ఎంపీ సెకండరీ సెన్సర్ కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ‘ఆండ్రాయిడ్ 8.1 ఓరియో’ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. 6.26 ఇంచ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే,  19:9 నిష్పతితోపాటు 1080x2280 పిక్సెల్ రిసొల్యూషన్ కలిగి ఉంటుంది. 

రెడ్ మీ నోట్ 6 ప్రో డిస్ ప్లే.. ఐఫోన్ ఎక్స్ మాదిరిగా ఉంటుంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ లేయర్ అమర్చారు. రెడ్ మీ నోట్ 6 ప్రో ఓక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఈ ఫోన్ మైక్రో ఎస్డీ కార్డుతో దీని స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.