Asianet News TeluguAsianet News Telugu

కార్ల కంపెనీలో ఏకంగా 6వేల ఉద్యోగాలు ఫట్.. కంపెనీ సీఈఓ కీలక నిర్ణయం..

టెస్లా హెడ్  ఆఫీస్,  ప్రధాన ఫ్యాక్టరీ  ఉన్న ఆస్టిన్‌లో 2,688 మంది ఉద్యోగులు ఈ కోతల్లో(layoffs) ఉన్నారు. టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్‌కు దాఖలు చేసిన నోటీసు ప్రకారం,ఈ  కోతలు జూన్ 14 నుండి 14 రోజుల వ్యవధిలో ప్రారంభమవుతాయి.
 

Tesla is reducing global workforce, will cut more than 6,000 jobs in these plants-sak
Author
First Published Apr 24, 2024, 6:29 PM IST

ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ  టెస్లా ఇంక్. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ 10 శాతానికి పైగా తగ్గించాలని  కంపెనీ CEO ఎలాన్ మస్క్ చేసిన డిమాండ్‌లో భాగంగా టెక్సాస్ ఇంకా  కాలిఫోర్నియాలో మొత్తం 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. 

టెస్లా హెడ్  ఆఫీస్,  ప్రధాన ఫ్యాక్టరీ  ఉన్న ఆస్టిన్‌లో 2,688 మంది ఉద్యోగులు ఈ కోతల్లో(layoffs) ఉన్నారు. టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్‌కు దాఖలు చేసిన నోటీసు ప్రకారం,ఈ  కోతలు జూన్ 14 నుండి 14 రోజుల వ్యవధిలో ప్రారంభమవుతాయి.

టెస్లా టెక్సాస్‌లో దాఖలు చేసిన ప్రత్యేక నోటీసుల ప్రకారం, కాలిఫోర్నియాలోని అనేక ప్రదేశాలలో 3,332 మంది ఉద్యోగులను  తొలగించే ప్రణాళికలను కూడా వెల్లడించింది. 

టెస్లా అతిపెద్ద ఉద్యోగ కోతలను ప్రారంభించడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా 140,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే, కంపెనీ  ఏప్రిల్ 15న  ఉద్యోగులలో 10 శాతానికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ప్లాన్‌ల గురించి తెలిసిన వ్యక్తుల ప్రకారం, వాస్తవానికి తొలగించిన వారి  సంఖ్య 20,000 దాటవచ్చు.

గత సంవత్సరం చివరలో,  ఆస్టిన్‌ కంపెనీలో 22,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.  సైబర్‌ట్రక్ ఇక్కడే  టెస్లా  ఉత్పత్తి కర్మాగారంలో తయారు చేయబడింది. అయితే, ప్లాంట్  ఉద్యోగాలు ఎంతమందిని తగ్గించారనేది స్పష్టంగా తెలియలేదు. టెస్లా స్టాక్ ఈ ఏడాది 42 శాతం పడిపోయింది. S&P 500 ఇండెక్స్‌లో  ఇది బ్యాడ్  పర్ఫార్మెన్స్.

Follow Us:
Download App:
  • android
  • ios