Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ పేమెంట్స్‌పై బ్యాన్..మనదేశానికి ఎంతవరకు సేఫ్?!

బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ నిషేధించిన తర్వాత భారతదేశంలో వాట్సాప్ పేమెంట్స్ వ్యవస్థను అనుమతించడం ఏ మేరకు సబబన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటి సంస్థలు పేమెంట్స్ సేవలందిస్తున్నాయ.
 

WhatsApp to launch payments service in India after Brazil blow
Author
Hyderabad, First Published Jun 26, 2020, 11:13 AM IST

న్యూఢిల్లీ: సాంకేతిక విప్లవం కారణంగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్‌తోపాటు అన్నీ మన అరచేతిలోకి వచ్చేశాయి. బ్యాంకింగ్‌ లావాదేవీలు సైతం నిమిషాల్లో జరిగిపోతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ వాట్సాప్‌ కూడా గూగుల్‌పే, ఫోన్‌పే తరహాలో వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలను ప్రవేశపెట్టింది. దాదాపు 2018 నుంచి దీని మీద కసరత్తు చేస్తోంది. అయితే బ్రెజిల్‌లో దాన్ని లాంచ్‌ చేయగా.. ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ దాన్ని ఈ మధ్య సస్పెండ్‌ చేసింది. 

దీంతో ఇప్పుడు వాట్సాప్‌ ఇండియాపై దృష్టి పెట్టింది. వాట్సాప్‌ పేమెంట్స్‌ను ఇండియాలో ప్రవేశపెట్టాలని చూస్తోంది. కాగా.. వాట్సాప్‌ పేమెంట్స్‌ను నిషేధించాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. చెల్లింపుల వ్యవస్థలో ఉన్న పోటీని నిర్ధారించుకునేందుకు బ్రెజిల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ దీన్ని నిలిపేసింది.

చెల్లింపుల్లో నష్టాలను అంచనా వేసిన బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్‌.. వాట్సాప్‌ నిబంధనలను కూడా పాటించడం లేదని చెప్తూ ఈ సేవలను సస్పెండ్‌ చేసినట్లు రిపోర్ట్‌ చెప్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వాట్సాప్‌ పేమెంట్స్‌ను తేవాలని కసరత్తులు చేసిన సంస్థకు ఇది పెద్ద దెబ్బ. 

కేవలం బ్రెజిల్‌లో లాంచ్‌ చేసిన వారాల వ్యవధిలోనే దీన్ని నిషేధించనట్లు తెలుస్తోంది. కాగా బ్రెజిల్‌లో నిలిపేసిన వెంటనే ఇండియాలో వాట్సాప్ పేమెంట్స్‌ను ప్రవేశపెడుతున్నామని వాట్సాప్‌ అధికార ప్రతినిధి చెప్పారు. 

also read గూగుల్ యూసర్లకు గుడ్ న్యూస్..ఆ యాప్స్ లో కొత్త ఫీచర్.. ...

యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్పేస్‌) ప్రపంచంలోనే ఇతర ప్రాంతాలకు ఒక లైట్‌హౌస్‌ మోడల్‌ అని, స్థానిక బ్యాంకులు, సంస్థలు అందరికీ ఆర్థిక సేవలను అందించగల ఒక స్థానిక స్టాక్‌పై ఆవిష్కరణలను అందిస్తున్నాయని వాట్సాప్‌ ప్రతినిధి చెప్పారు.  బ్రెజిల్‌ దీన్ని నిషేధించడంతో మనదేశంలో వాటి సేవలను అందుబాటులోకి తేవడం ఎంత వరకు సురక్షితమనే విషయంపై మళ్లీ చర్చ జరుగుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద మేసేజింగ్‌ యాప్‌గా పేరొందిన వాట్సాప్‌ సంస్థకు మనేశంలో దాదాపు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 2018లోనే దీనికి సంబంధించి యూపీఐ పిన్‌ ఆధారంగా బీటా టెస్టింగ్‌ చేశారు. 

రిలయన్స్‌ జియో ఫ్లాట్‌ఫామ్‌లో ఫేస్‌బుక్‌ 5.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) క్లియర్‌‌ చేసిన వెంటనే ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ పేమెంట్స్‌ విషయమై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. భారతదేశంలో యూపీఐ పేమెంట్స్‌ కూడా చాలా ఉన్నాయి. 

గూగుల్‌పే, అమెజాన్‌ పే, ఫోన్‌ పే లాంటివి ఇప్పటికే మనుగడలో ఉన్నందున వాట్సాప్‌ పేమెంట్స్‌ కూడా కచ్చితంగా పాపులర్‌‌ అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కరోనా కాలంలో భౌతికదూరం గురించి ప్రచారం జరుగుతున్నందున ఇలాంటి డిజిటల్ పేమెంట్లు బాగా వాడకంలోకి వస్తాయని అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios