గూగుల్ పై యూఎస్ ప్రభుత్వం దాడి.. ఇక క్రోమ్ బ్రౌజర్ ఉండదా..?


గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని అమ్మేయాలంటూ అమెరికా ప్రభుత్వం సదరు సంస్థను ఒత్తిడి చేయడం గమనార్హం.

US to call for Google to sell Chrome browser: report ram

 

ప్రపంచంలో గూగుల్ తెలియని వాళ్లు ఎవరైనా ఉంటారా? ప్రపంచంలో ఏ విషయం గురించి  తెలుసుకోవాలన్నా ముందుగా వెతికేది గూగుల్ లోనే. అలాంటి గూగుల్ సంస్థ ని అమెరికా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని అమ్మేయాలంటూ అమెరికా ప్రభుత్వం సదరు సంస్థను ఒత్తిడి చేయడం గమనార్హం. దీని కారణంగా గూగుల్ ఏఐ కార్యకాలపాలతో పాటు.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ విషయంలో న్యాయశాఖను కూడా ఆశ్రయించింది.

 

ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, గూగుల్ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించే మార్గాలను పరిశీలిస్తున్నారు. ఇందులో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా క్రోమ్ బ్రౌజర్ విక్రయం కూడా ఉంటుందని సూచించారు. గూగుల్ విభజనకు పిలుపునివ్వడం అమెరికా రెగ్యులేటర్లకు పెద్ద మార్పుగా నిలుస్తుంది, 

 

గూగుల్, న్యాయశాఖ ప్రతిపాదనను  గూగుల్ వ్యతిరేకిస్తోంది.  చాంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ ముఖ్య కార్యనిర్వాహకుడు ఆడమ్ కోవాచేవిచ్, ఈ ప్రతిపాదనలు చట్టపరంగా అసాధారణమైనవి , అనవసరమైనవని పేర్కొన్నారు. 



 

  • ప్రభుత్వం ఎందుకు గూగుల్‌పై దాడి చేస్తోంది? అమెరికా ప్రభుత్వం గూగుల్ శోధన మార్కెట్‌పై అక్రమంగా ఆధిపత్యం చెలాయిస్తుందని ఆరోపిస్తోంది. ఈ ఆధిపత్యం వినియోగదారులకు హానికరం అని ప్రభుత్వం భావిస్తోంది.
  • గూగుల్‌పై ఏ చర్యలు తీసుకోవచ్చు? ప్రభుత్వం గూగుల్‌ను క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించమని బలవంతం చేయవచ్చు. అంతేకాకుండా, గూగుల్‌ను ఇతర కంపెనీలతో చేసిన ఒప్పందాలను రద్దు చేయమని బలవంతం చేయవచ్చు.
  • గూగుల్ ఏమంటోంది? గూగుల్ ఈ చర్యలను అతిశయోక్తిగా అభివర్ణిస్తూ, తన ఉత్పత్తులు ఉత్తమమైనవి కాబట్టే వినియోగదారులు వాటిని ఎంచుకుంటున్నారని వాదిస్తోంది.
  • ఈ కేసు ఎందుకు ముఖ్యమైనది? ఈ కేసు బిగ్ టెక్ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ ఎంతవరకు ఉండాలనే దానిపై ఒక ముఖ్యమైన చర్చను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే ఇంకా చాలా కాలం పట్టవచ్చు.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios