ఫోన్ నంబర్ తో పనిలేదు.. వాట్సాప్ మరో అదిరిపోయే ఫీచర్
Whatsapp Username And Pin Feature : తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఫోన్ నంబర్ తో పనిలేకుండా మెసెజ్ లు చేసుకునేలా 'యూజర్ నేమ్' పేరుతో అద్భుత ఫీచర్ ను తీసుకువస్తోంది.
Whatsapp Username And Pin Feature : వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్ ను వినియోగదారుల కోసం తీసుకువస్తోంది. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ అప్లికేషన్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్న వాట్సాప్.. ఎప్పటికప్పుడు సరికొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ ను తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను తీసుకురానున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం వాట్సాప్ అప్లికేషన్ కాంటాక్ట్ నంబర్‌లను ఉపయోగించి మెసెజ్ లు చేసుకునేలా పనిచేస్తుంది. అయితే, ఇక నుంచి ఫోన్ నంబర్ తో పనిలేకుండా వాట్సాప్ మెసెజ్ లను పంపించుకోవచ్చు.
WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ తన వినియోగదారులు వారి ప్రొఫైల్‌ల కోసం ఇన్‌స్టాగ్రామ్ లో మాదిరిగా ప్రత్యేకమైన యూజర్ నేమ్ లను పెట్టుకోవచ్చు. ఈ యూజర్ నేమ్ లను ఉపయోగించి ఫోన్ నంబర్ తో పనిలేకుండా చాట్ చేయవచ్చు. అంటే ఫోన్ నంబర్లను పంచుకోకుండానే వేర్వేరు వ్యక్తులతో చాట్ చేయడానికి ఈ యూజర్ నేమ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. తమ యూజర్ల భద్రతను ఉంచుకుని వాట్సాప్ ఈ ఫీచర్ ను తీసుకువస్తోంది. ఫోన్ నంబర్లను మార్చుకోవడం వల్ల కొన్ని సార్లు తరచుగా ఫోన్ కాల్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారనీ, మరీ ముఖ్యంగా మహిళల విషయంలో ఇది ఎక్కువగా ఉండటంతో ఈ ఫీచర్ ను తీసుకువస్తున్నట్టు సమాచారం.
ఫోన్ నంబర్ ను మార్చుకోకుండా వారు కేవలం తమ యూజర్ నేమ్ ను ఇవ్వవచ్చు. యూజర్ నేమ్ ను ఎంటర్ చేసి చాట్ చేయవచ్చు. వినియోగదారులు తమ యూజర్ నేమ్ తో చాట్ చేయడానికి ఫిన్ పెట్టుకోవచ్చు. అంటే మీరు మీ యూజర్ నేమ్ తో పాటు పిన్ షేర్ చేస్తేనే వారు మీతో చాట్ చేయడానికి ఉంటుంది. పిన్ ని కొత్త వారు ఎంటర్ చేస్తేనే ఇతరులతో చాట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా కొత్తవారితో ఛాట్ చేసే అన్ని భద్రతా విషయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతానికి వాట్సాప్ వెబ్ యూజర్లకు మాత్రమే రానుంది. త్వరలోనే యాప్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫీచర్ ను తీసుకురావడం కోసం వాట్సాప్ యాప్ డిజైన్ లో కూడా కొన్ని మార్పులు ఉండనున్నాయని సమాచారం. ఇది కూడా యూజర్లను ఎంతో ఆకట్టుకుంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. వాట్సాప్ తీసుకువస్తున్న యూజర్ నేమ్ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు సమాచారం. ఈ ఫీచర్ రోల్‌అవుట్ ఖచ్చితమైన టైమ్‌లైన్ ఇప్పటికే ఉంది.
ఐసీసీ చీఫ్ గ్రెగ్ బార్క్లే నిర్ణయంతో అందరీ కళ్లు బీసీసీఐ కార్యదర్శి జైషా పైనే..