Lifestyle

బైకర్లకు మర్చిపోలేని రోడ్ ట్రిప్‌ని అందించే మార్గాలు ఇవి..

బైక్ రైడింగ్ కి బెస్ట్ రూట్

బైక్ రైడింగ్ ఇష్టపడే వాళ్లకి ఇండియాలో చాలా మంచి రూట్స్ ఉన్నాయి. కబినీ వన్యప్రాణుల నుంచి లేహ్‌లోని ఎత్తైన కనుమల వరకు సరికొత్త అనుభూతిని పంచే ఒక రూట్ ఉంది.

బెంగళూరు నుండి కబినీ రూట్

బెంగళూరు-మైసూర్-కబినీ రూట్ ప్రకృతి పచ్చదనంతో ఉంటుంది. కబినీలో మీకు వన్యప్రాణులు కనుల విందు చేస్తాయి. ఇక్కడి టైగర్ రిజర్వ్, బ్యాక్ వాటర్స్ మీ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి.

భుజ్ నుండి ధోలావీర

భుజ్- భచావ్ - ధోలావీర ప్రయాణంలో కచ్ ఎడారిలో బైక్ నడపడం ఒక కలలా ఉంటుంది. దారిలో రణ్ ఉత్సవ్, హస్తకళల మార్కెట్, కచ్ సంస్కృతిని మీకు మర్చిపోలేని ట్రిప్ అనుభవాన్ని పంచుతాయి.

ఢిల్లీ నుండి జైపూర్ (కింగ్స్ రైడ్)

ఢిల్లీ - గురుగ్రామ్ - మానేసర్ మీదుగా ఈ రూట్ చారిత్రక కట్టడాలు, ఎడారి అందాల కలయిక. జైపూర్ చేరుకుని రాజస్థానీ సంస్కృతిని ఆస్వాదించవచ్చు.

మైసూర్ నుండి ఉటీ (నీలగిరి రైడ్)

మైసూర్ - బాందిపూర్ నేషనల్ పార్క్ - ఉటీ మీదుగా ఈ రూట్ వంకర టింకర రోడ్లు, పచ్చదనానికి ప్రసిద్ధి. ఉటీ వాతావరణం, టీ తోటలు మీ ప్రయాణాన్ని మరపురానిదిగా చేస్తాయి.

జమ్మూ నుండి గుల్మార్గ్ (కాశ్మీర్ లోయల్లో రైడ్)

జమ్మూ - శ్రీనగర్ - గుల్మార్గ్ రూట్‌లో పచ్చని పర్వతాలు, సరస్సులు, మంచుతో కప్పబడిన శిఖరాలు కనిపిస్తాయి. గుల్మార్గ్ అందమైన స్నో రైడింగ్ అనుభవం దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది.

షిమ్లా నుండి కాజా (స్పితి వ్యాలీ అందం)

షిమ్లా - సరాహన్ - స్పితి - కాజా రూట్ సాహస రైడర్లకు సరిపోతుంది. ఇక్కడి ఇరుకైన రోడ్లు, మంచు లోయలు, పురాతన బౌద్ధ మఠాలు మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి.

మనాలి నుండి లేహ్ (డ్రీమ్ బైక్ రైడ్)

మనాలి - రోహతాంగ్ పాస్ - సర్చు - లేహ్ రూట్ ప్రతి బైక్ రైడ్ చాలా గొప్ప కల అని చెప్పాలి.  ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ రోడ్, అందమైన కనుమలు, లడఖ్ ప్రశాంతత దీన్ని అందంగా చేస్తాయి.

మంగళూరు నుండి గోవా (గోల్డెన్ సాండ్ రైడ్)

మంగళూరు - ఉడిపి - కార్వార్ - గోవా బైక్ రైడ్ దాదాపు 350KM. ఈ రూట్‌లో ఒకవైపు సముద్రపు అలలు, మరోవైపు కొబ్బరి చెట్లు సూపర్ అని చెప్పాలి. అక్టోబర్ నుండి మార్చి సమయం ట్రిప్ బాగుంటుంది.

ఆరెంజ్ తొక్కలతో ఎన్ని పనులు చేయొచ్చో తెలుసా

చాణక్య నీతి ప్రకారం.. ఏది ఏమైనా ఈ పనులను మాత్రం వెంటనే చేయాలి

ఆడవాళ్లకు షుగర్ ఉంటే ఏమౌతుందో తెలుసా

రోజూ ఇడ్లీ తింటే ఏమౌతుంది?