1986 నాటి సోనీ ల్యాప్‌టాప్ ఎలా ఉందో తెలుసా? వైరల్ వీడియో
1986 Sony Laptop Viral Video : 1986 నాటి పాతకాలపు సోనీ ల్యాప్‌టాప్‌ను చూపించే వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మరీ అప్పటి ల్యాప్ టాప్ ఎలా ఉందో తెలుసా?
1986 Sony Laptop Viral Video: 1986 నాటి పాతకాలపు సోనీ ల్యాప్‌టాప్‌ను చూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ టెక్ ఔత్సాహికులను ఆకర్షించింది. ఈ వీడియో చాలా త్వరగా వైరల్ అయ్యింది. ఇది తొలినాళ్లలో పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చూపిస్తుంది. అప్పటి ఈ ల్యాప్ టాప్ నేడు లభిస్తున్న అత్యంత సన్నని, టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్ లతో పోలిస్తే అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
భారతదేశంలో అత్యధిక జీతం ఇచ్చే టాప్-10 ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటో తెలుసా?
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి సోనీ ల్యాప్‌టాప్ ను చూపించాడు. ల్యాప్ టాప్ ఎలా ఉంది? దాని పేరు? సహా ప్రాథమిక లక్షణాలను చూపించాడు. దాని బరువైన డిజైన్ నుండి దాని మోనోక్రోమ్ డిస్ప్లే, ప్రాథమిక ఇంటర్‌ఫేస్ వరకు చాలా భిన్నంగా కనిపిస్తోంది. నేడు మనం ఉపయోగించే అల్ట్రా-థిన్, టచ్-స్పాన్సివ్ ల్యాప్‌టాప్ లకు ఏమాత్రం సంబంధం లేకుండా చాలా విచిత్రంగా, భిన్నంగా ఉంది.
ఈ రెట్రో ల్యాప్‌టాప్ నెటిజన్లలో ఉత్సాహభరితమైన స్పందనను రేకెత్తించింది, చాలామంది పాతకాలపు గాడ్జెట్‌ల పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలలో కంప్యూటింగ్ సాంకేతికత ఎలా మారిందో చెబుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్.. "కంప్యూటర్ క్రానికల్స్ నాకు చాలా ఇష్టమైన షో. 80s, 90s నాటి పోర్టబుల్స్, PCలను డాక్యుమెంట్ చేసే టీవీ షో.. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలని నేను ప్రోత్సహిస్తున్నాను. మనం చాలా దూరం వచ్చాము. కిలోబైట్‌లు టెరాబైట్‌లుగా ఎవరూ ఊహించని విధంగా మారాయి" అని పేర్కొన్నాడు.
మరో యూజర్.. "సాంకేతికత నిజంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది" అని కామెంట్ చేశాడు.