ట్విట్టర్ లో ఐఫోన్ 12 మినీ టీజర్ వీడియో.. పోర్న్ వీడియో అనుకోని అక్కౌంట్ బ్లాక్..

ట్విట్టర్ లో ఐఫోన్ 12 మినీ వీడియోను అప్‌లోడ్ చేసినందుకు వినియోగదారుడిని ట్విట్టర్ బ్లాక్‌ చేసింది. ట్విట్టర్ అల్గోరిథంలు యూజర్‌ పోస్ట్‌ చేసిన ఐఫోన్ 12 మినీ టీజర్ వీడియో కంటెంట్‌ను అభ్యంతరకరమైందిగా గుర్తించినట్లు ట్విటర్‌ తెలిపింది.

Twitter mistook iPhone 12 Mini teaser video as porn content, wrongly blocked user account

మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్ లో ఐఫోన్ 12 మినీ వీడియోను అప్‌లోడ్ చేసినందుకు వినియోగదారుడిని ట్విట్టర్ బ్లాక్‌ చేసింది. ట్విట్టర్ అల్గోరిథంలు యూజర్‌ పోస్ట్‌ చేసిన ఐఫోన్ 12 మినీ టీజర్ వీడియో కంటెంట్‌ను అభ్యంతరకరమైందిగా గుర్తించినట్లు ట్విటర్‌ తెలిపింది.

ట్విట్టర్ ప్లాట్‌ఫాం హానికరమైన, అశ్లీలమైన కంటెంట్‌ను ఫిల్టర్ చేస్తుంది, అయితే ఫోన్ గురించి వీడియో మైక్రో బ్లాగింగ్ సైట్‌కు ఎందుకు అనుచితంగా చేసిందో ఆశ్చర్యానికి గురిచేసింది.

ఐఫోన్ 12 మినీ  వీడియో టీజర్‌ను పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత తన ట్విట్టర్ ఖాతా లాక్  అయిందని ట్విట్టర్ యూజర్ నిఖిల్ చావ్లా  తెలిపాడు. తన వీడియో ట్విట్టర్ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదు అలాగే అభ్యంతరకరమైన కంటెంట్‌ను కలిగి లేదు, అయినప్పటికీ వీడియోను తొలగించింది. 

“ఐఫోన్ 12 మినీ స్మార్ట్ ఫోన్ పరిచయాన్ని పోస్ట్ చేసినందుకు ట్విట్టర్ నా ఖాతాను 12 గంటలు బ్లాక్ చేసింది. వారు దానిని సన్నిహిత / అశ్లీల కంటెంట్ అని ఫ్లాగ్ చేశారు. 12 గంటల తరువాత వారు నా ఖాతాను అన్‌లాక్ చేసి వీడియో  తొలగించడానికి నాకు ఒక ఆప్షన్ ఇచ్చారు.  తరువాత ట్విట్టర్ తీర్పు లోపానికి వ్యతిరేకంగా నేను విజ్ఞప్తి చేసాను, ”అని చావ్లా పేర్కొన్నాడు.

also read 13 ఎక్స్సైజ్ మోడ్స్ తో వన్‌ప్లస్ బ్యాండ్ లాంచ్.. ఫీచర్స్, ధర తేలుసుకొండి.. ...

“అప్పుడు వారు  నా అప్పీల్ చదివి దానికి సమాధానం ఇచ్చేవరకు నా ఖాతా మరో 24 గంటలు మళ్ళీ లాక్ అయింది. నేను ట్విట్టర్ ఇండియా పాలసీ బృందాన్ని సంప్రదించాక ఖాతాను అన్‌లాక్ చేశారు” అని అన్నారు. 

వీడియోలో అభ్యంతరకరంగా ఏమీ లేదు. ఇది వివిధ కోణాల నుండి ఐఫోన్ 12 మినీని మాత్రమే చూపించింది. వీడియోలో అశ్లీల విషయాలు ఉన్నాయని అల్గోరిథంలు గుర్తించిందని  ట్విటర్‌ తెలిపింది.  

ట్విట్టర్‌లో చాలా అశ్లీల కంటెంట్‌ను ఇప్పటికీ చూడవచ్చు కాని సున్నితమైనదిగా మార్క్ చేసిన కంటెంట్ మాత్రమే ఉండటానికి అనుమతించబడుతుందని కంపెనీ తెలిపింది. ఇలాంటి వాటిని నిరోధించేందుకు వినియోగదారులు సేఫ్టీ సెటింగ్స్‌లో మీడియా సెన్సెటివ్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలని సూచించింది.   
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios