ముఖంపై వెంట్రుకలు తొలగించాలా? బెస్ట్ చిట్కాలు ఇవి
ముఖంపై వెంట్రుకలను తొలగించుకోవడానికి రెగ్యులర్ గా పార్లర్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అంత సింపుల్ గా ఏమీ ఉండదు… థ్రెడ్డింగ్ లేదంటే, వ్యాక్స్ చేయించాలి. ఈ రెండూ కూడా పెయిన్ ఫుల్ గానే ఉంటాయి.
చాలా మంది అమ్మాయిలను కామన్ గా వేధించే సమస్య అవాంఛిత రోమాలు. ముఖంపై ముఖ్యంగా పెదాలపైన.. గడ్డం మీద అనవసరంగా జుట్టు పెరుగుతూ ఉంటుంది. వాటి వల్ల ముఖంపై అందం పోతుంది. కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. ఆ వెంట్రుకలను తొలగించుకోవడానికి రెగ్యులర్ గా పార్లర్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అంత సింపుల్ గా ఏమీ ఉండదు… థ్రెడ్డింగ్ లేదంటే, వ్యాక్స్ చేయించాలి. ఈ రెండూ కూడా పెయిన్ ఫుల్ గానే ఉంటాయి. కానీ.. అలా కాకుండా కూడా.. సింపుల్ గా కొన్ని హోం రెమిడీలు వాడి కూడా సులభంగా తొలగించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం…
నిమ్మకాయ, పంచదార..
ఒక టేబుల్ స్పూన్ పంచదార తీసుకొని.. అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. రెండింటినీ కలిపి మంచిగా పేస్టులాగా చేసుకోవాలి.ఈ పేస్టును అప్పర్ లిప్ పైన మీ ముఖంపై ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడ రాయాలి. 15 నిమిషాలపాటు అలానే వదిలేసి.. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల అవాంఛిత రోమాలు పోతాయి. ఈ రెమిడీ మనకు పెయిన్ ఫుల్ గా కూడా ఉండదు.
పాలు, పసుపు…
ఒక గిన్నెలో ఒక టీస్పూన్ పసుపు తీసుకొని అందులో.. ఒక స్పూన్ పాలు పోయాలి. దీనిని పేస్టులాగా చేసుకొని వెంట్రుకలు ఉన్న చోట అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత ఎండిపోతుంది. అప్పుడు కాస్త రుద్దుతూ నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల కూడా ఈజీగా వెంట్రుకలు తొలగిపోతాయి.
శెనగపిండి..
శెనగపిండిని నీటితో కలిపాలి. దాంట్లోనే కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా వేసి పేస్టులాగా చేసి.. ముఖంపై వెంట్రుకలు ఉన్న ప్రదేశంలో రాయాలి. అది ఎండిపోయిన తర్వాత… స్క్రబ్ లాగా చేయాలి. తర్వాత నీటితో కడిగితే.. వెంట్రుకలు పోతాయి.
పెరుగు..
ఒక స్పూన్ పెరుగులో.. కొంత మినపప్పు పొడి వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి.. ఆ తర్వాత నెమ్మదిగా రుద్దుతూ కడగాలి. ఇలా చేయడం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు తొలగిపోతాయి.
తేనె..
ఒక టీ స్పూన్ తేనెలో కొద్దిగా నిమ్మరసం పిండి బాగా కలపాలి. దీనిని ముఖానికి రాసుకొని ఎండనిచ్చి.. గట్టిగా రుద్దుతూ శుభ్రం చేసినా కూడా వెంట్రుకలన్నీ పోతాయి. అయితే.. ఒక్కసారిగా పోవు. రెగ్యులర్ గా చేస్తూ ఉంటే.. కచ్చితంగా ఫలితం చూస్తారు.
గోధుమపిండి..
గోధుమ పిండిలో పాలు పోసి.. పేస్టులాగా చేసుకొని ముఖానికి రాసుకున్నా కూడా.. అవాంఛిత రోమాలను ఈజీగా తొలగించవచ్చు.