MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాహుబలి వద్దు ఆపేద్దాం, ప్రభాస్ కోసం మరో కథ బయటకి తీసిన రాజమౌళి..చివరి నిమిషంలో ఏం జరిగిందంటే..

బాహుబలి వద్దు ఆపేద్దాం, ప్రభాస్ కోసం మరో కథ బయటకి తీసిన రాజమౌళి..చివరి నిమిషంలో ఏం జరిగిందంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో, తెలుగు సినిమా చరిత్రలో ఒక కళాఖండం లా మిగిలిపోతుంది బాహుబలి చిత్రం. తనని అర్థం చేసుకునే నిర్మాతలు.. నమ్మకం ఉంచే హీరోని పెట్టుకుని రాజమౌళి శక్తివంచన లేకుండా కష్టపడ్డారు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Nov 30 2024, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో, తెలుగు సినిమా చరిత్రలో ఒక కళాఖండం లా మిగిలిపోతుంది బాహుబలి చిత్రం. తనని అర్థం చేసుకునే నిర్మాతలు.. నమ్మకం ఉంచే హీరోని పెట్టుకుని రాజమౌళి శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. దానికి ప్రతిఫలమే బాహుబలి రెండు భాగాలు సాధించిన విజయం. తెలుగు సినిమా కంటే బాలీవుడ్ పెద్దది అనే భావనని బద్దలు కొట్టిన చిత్రం బాహుబలి. 

25

అంతటి భారీ చిత్రం చేస్తున్నప్పుడు చాలా కష్టాలు, సందేహాలు ఎదురుకావడం సహజమే. బాహుబలి ప్రారంభ దశలో ఉన్నప్పుడు రాజమౌళి కూడా భయపడ్డారట. ఎందుకంటే జక్కన్న ఏం చేసినా లెక్కలు వేసుకుని ముందడుగు వేస్తారు. బాహుబలి మూవీ ప్రారంభానికి ముందు 100 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అప్పుడు రెండు పార్టులుగా తీయాలనే ఆలోచన కూడా లేదు. 

35
Bahubali Rajamouli

Bahubali Rajamouli

కానీ కథ పూర్తిగా డెవలప్ అయ్యాక రెండు పార్టులు తీయాలనే ప్రతిపాదన వచ్చింది. అప్పుడు మరోసారి బడ్జెట్ లెక్కలు వేసుకున్నారు. బడ్జెట్ పరిమితికి మించి అవసరం అవుతోంది. దీనితో జక్కన్న భయపడ్డాడు. ఇంత రిస్క్ చేయడం చాలా ప్రమాదం అని గమనించి వెంటనే నిర్మాతలకు చెప్పాడట. ఈ విషయాలని స్వయంగా ప్రభాస్ ఓ ఈవెంట్ లో రివీల్ చేశారు. 

45

బాహుబలి బడ్జెట్ చాలా రిస్క్ అనిపిస్తోంది. ఈ సినిమా వద్దు ఇక్కడితో ఆపేద్దాం.. షూటింగ్ మొదలు పెట్టి మధ్యలో ఆపేస్తే బాగోదు అని రాజమౌళి నిర్మాతలకు చెప్పారు. మరో ప్రతిపాదన తీసుకువచ్చారు. బాహుబలి ఆపేస్తున్నాం అని ప్రభాస్ కి నేను చెబుతా.. అతడు అర్థం చేసుకుంటాడు. బాక్సింగ్ నేపథ్యంలో మరో అద్భుతమైన కథ ఉంది. దానికి ఇంత బడ్జెట్ అవసరం లేదు. ఆ కథతో ప్రభాస్ తో మూవీ చేద్దాం అని రాజమౌళి చెప్పారట. కానీ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.. రాజమౌళి ప్రతిపాదనని ఒప్పుకోలేదు. 

55

మనం బాహుబలినే చేద్దాం.. డబ్బు గురించి ఆలోచించొద్దు. రిస్క్ అయినా పర్వాలేదు. ఒక అద్భుతమైన చిత్రం చేయాలి అని అడిగారట. నిర్మాతలే ధైర్యంగా ఉండడంతో అప్పుడు రాజమౌళి కూడా అంగీకరించారు. ఆ విధంగా రిస్క్ చేసి బాహుబలితో అద్భుతం చేసారు. అయితే రాజమౌళి దగ్గర ఉన్న ఆ బాక్సింగ్ కథ ఏమైనట్లు ? ప్రభాస్ కోసం జక్కన్న ఫ్యూచర్ లో మళ్ళీ ఆ కథని బయటకి తీసే ఛాన్స్ ఉందా అనే చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ ప్రారంభానికి ముందు కూడా రాజమౌళి.. ఎన్టీఆర్, రాంచరణ్ లతో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ తెరకెక్కిస్తున్నారు అని రూమర్స్ వచ్చాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hey Balwanth 6 Days Collections: హే బలవంత్‌ 6 రోజుల కలెక్షన్లు.. సుహాస్‌ మూవీ నిజంగానే సేఫ్‌ అయ్యిందా?
Recommended image2
రూ. 100 కోట్ల సినిమా.. కట్ చేస్తే.. తెగింది మాత్రం 20 టికెట్లు మాత్రమే.. ఆ మూవీ ఏదంటే.?
Recommended image3
హీరోగా చిరంజీవి.. నిర్మాతగా శ్రీదేవి.. షూట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved