వేసవికాలం అయిపోయి వర్షాకాలం రానే వచ్చేసింది. వేసవిలో ఎండ నుంచి ఎన్ని జాగ్రతలు తీసుకుంటామో వర్షాకాలంలో కూడా కొన్ని జాగ్రతలు తీసుకోవాల్సి  ఉంటుంది. సాధరణంగా వర్షాకాలంలో ఆఫీసులకు, ఉద్యోగాలకు, పనులకు వెళ్తుంటారు కానీ వర్షాకాలంలో వర్షం ఎప్పుడు వస్తుందో మనల్ని ఎప్పుడు వర్షంలో  తడిపేస్తుందో అస్సలు ఊహించలెం.

బయటికి వెళ్ళి వచ్చేలోగా ఒకోసారి వర్షం మనల్ని చినుకులతో తడిపేస్తుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వారు చాలా తక్కువ. ఏ ప‌ని చేయాల‌న్నా, ఎవ‌రితో మాట్లాడాల‌న్నా ఫోన్ త‌ప్ప‌నిసరి. స్మార్ట్ ఫోన్ వల్ల మన పనులు కూడా చాలా సులభమవుతుంది.

అలాంటిది వ‌ర్షంలో ఫోన్ త‌డిసిపోతే అయ్యో అని బాధపడక తప్పదు ఒకోసారి. ఫోన్ వర్షంలో త‌డ‌వ‌గానే కొన్నిసార్లు స్క్రీన్ రంగులు మారే అవ‌కాశం కూడా ఉంటుంది. ఫోన్‌కి వారెంటీ ఉన్న‌ప్ప‌టికీ కూడా ఏం చేయ‌లేం. వర్షాకాల సమయంలోనే కొన్ని జాగ్రతలు తీసుకుంటే చాలు ఫోన్ పాడవకుండా చూసుకోవచ్చు. ఒకసారి అవేంటో చూసుకోవచ్చు 


 వ‌ర్షంలో మీ ఫోన్ తడిచినపుడు వెంట‌నే స్విచ్ఛాఫ్ చేయాలి, ఒకెవేల ఫోన్ పనిచేస్తున్న ముందు జాగ్రతగా ఆ పని చేసిన చాలా మంచిదే. చాలా మంది ఫోన్ తడిసినపుడు తేమ అంతా ఆరిపోతే ఫోన్ ప‌నిచేస్తుంద‌ని స్విచ్ ఆన్ అస‌లు చేయ‌కూడ‌దు, ఎండ‌లో అస‌లు పెట్ట‌కూడ‌దు. ఎప్పుడైనా వ‌ర్షంలో ఫోన్ తడిస్తే వెంటనే బ్యాక్ క‌వ‌ర్ తోల‌గి త‌ర్వాత పొడి/ కాటన్  క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడ‌వాలి.

also read విప్రో కొత్త సీఈవో థియరీ డెలాపోర్ట్ జీతం ఎంతో తెలుసా?

ఆ త‌ర్వాత బ్యాట‌రీ, సిమ్‌, మెమొరీ కార్డుల‌ను తీసి ప‌క్క‌న ఆర పెట్టాలి.  ఇప్ప‌డు మళ్ళీ పొడి/కాటన్ క్లాత్ గాని టిష్యూ పేప‌ర్‌తో గాని ఫోన్‌ని బాగా తుడ‌వాలి. ఇప్పుడు ఒక కవర్‌లో బియ్యం తీసుకొని అందులో ఫోన్, బ్యాటరీని ఉంచి బియ్యంతో పూర్తిగా కప్పేసి గాలి చేరకుండా కవర్‌ని క్లోజ్ చెయ్యాలి.

ఎందుకంటే  బియ్యానికి నీటిని పీల్చేసే శక్తి బాగా ఉంటుందని టెక్నికల్ నిపుణులు చెబుతున్నారు. ఒక రోజంతా అలా ఉంచిన తర్వాత మొబైల్ తీసి, మరోసారి తుడిచి బ్యాటరీ, సిమ్ వేసి ఆన్ చేసి వాడుకోవచ్చు. ఒకవేళ మొబైల్ పనిచేయకపోతే ఛార్జింగ్ పెట్టి చూడాలి. అయినా కానీ ఆన్ కాకపోతే కొత్త బ్యాటరీ వేసి ప్రయత్నించాలి.

అప్పుడు కూడా ఆన్ కాకపోతే, ఇక సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళడం మంచిది. చాలా సందర్భాల్లో మొబైల్ నీటిలో పడిన తర్వాత, వాన నీటిలో తడిసిన ఐదు నిమిషాలలోపు తిరిగి బయటికి తెసేస్తే పనిచేస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్స్ కూడా చాలా వరకూ బాగా పనిచేస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఎంతో ఆలోచించి ఇష్టపడి ఎన్నో వేలు పోసి స్మార్ట్ ఫోన్ కొంటుంటం. ఇంకా అందులో మనకు కావల్సిన ఫోన్ నంబర్స్, ఫోటోస్, ఇతర ముఖ్యమైన సమాచారం కూడా దాచుకుంటం. ఒకవేళ స్మార్ట్ ఫోన్ పోతే ఎంతో బాధపడుతుంటం అందుకే వర్షాకాలంలో ఎలాంటి చిన్న చిన్న జాగ్రతలు పాటించడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్ జాగ్రతగా కాపాడుకోవచ్చు.