Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్నెట్ స్పీడులో ప్రపంచ రికార్డు, 1 సెకనుకి వందల సినిమాలు డౌన్‌లోడ్..

యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఇంజనీర్లు అత్యంత ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడులో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇటీవల అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో డేటాను ఇప్పుడు సెకనుకు 178 టెరాబిట్స్ (టిబి) వేగంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

fastest Internet speed made World record, Netflix movies can be downloaded in less than 1 second
Author
Hyderabad, First Published Aug 28, 2020, 2:24 PM IST

ఈ రోజుల్లో చాలా మంది ఇంటర్నెట్ స్పీడ్ గురించి సాధారణంగా మాట్లాడుతుంటారు. హెచ్‌డి లేదా 4కే వీడియోలను డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఇంజనీర్లు అత్యంత ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడులో ప్రపంచ రికార్డు సృష్టించారు.

ఇటీవల అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో డేటాను ఇప్పుడు సెకనుకు 178 టెరాబిట్స్ (టిబి) వేగంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్  రికార్డును జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నమోదు చేశారు. దాని వేగం సెకనుకు 172 టెరాబిట్స్.

నెట్‌ఫ్లిక్స్ సినిమాలు డౌన్‌లోడ్‌ 
స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ లోని సినిమాల డౌన్‌లోడ్‌ సెకనులో జరుగుతాయి.  178 టెరాబిట్ ఇంటర్నెట్ వేగంతో నెట్‌ఫ్లిక్స్ లోని మొత్తం లైబ్రరీని సెకనులోపు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వేగంతో ప్రపంచంలోని మొట్టమొదటి చిత్రాన్ని రూపొందించడానికి సేకరించిన డేటాను డౌన్‌లోడ్ చేయడానికి ఒక గంట కన్నా తక్కువ సమయం పడుతుంది. ఈ ఘనతను సాధించడానికి, డేటాను అర టన్నుల హార్డ్ డ్రైవ్‌లో నిల్వ చేసి ఎం‌ఐ‌టికి పంపారు.

also read టిక్‌టాక్ సి‌ఈ‌ఓ రాజీనామా.. అసలు కారణం అదేనా.. ? ...

ఆప్టికల్ ఫైబర్ కాకుండా వెబ్‌ లెంత్స్  ఉపయోగించి
ఎక్కువ స్పీడ్  కోసం యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఆప్టికల్ ఫైబర్ కంటే వెబ్‌ లెంత్ ద్వారా డేటాను పంపారు. పరిశోధనా బృందం 9THz కు బదులుగా 16.8 టెరాహెర్ట్జ్ (THz) ను ఉపయోగించింది, ఇది ఎంచుకున్న మార్కెట్లలో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం మన ఇంటర్నెట్ పనిచేసే సిస్టమ్ 4.5THz  బ్యాండ్‌విడ్త్‌ను ఉపయోగిస్తుంది.

ఇంటర్నెట్ ట్రాఫిక్ పెరిగింది 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంటర్నెట్ ట్రాఫిక్ చాలా రెట్లు పెరిగిందని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెసర్, రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ పరిశోధనా సహచరుడు డాక్టర్ గాల్డినో అభిప్రాయపడ్డారు.

దీనికి ముందే గత 10 సంవత్సరాల్లో ఇంటర్నెట్ ట్రాఫిక్ వేగంగా పెరిగింది. డేటా డిమాండ్‌లో ఈ పెరుగుదల తగ్గుతున్న బిట్‌తో ముడిపడి ఉంది. తక్కువ ఖర్చుతో డేటాను అందించే ధోరణిని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో డేటా డిమాండ్‌ను తీర్చడంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ముఖ్యమని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios