Asianet News TeluguAsianet News Telugu

యువరాణి ‘ఆరా’కు స్వాగతం.. కూతురు ఫొటో షేర్ చేసిన యూవీ...

భారత మాజీ  క్రికెటర్ యువరాజ్ సింగ్ తన కూతురు ‘ఆరా’ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. 

Yuvraj Singh shared daughter's photo - bsb
Author
First Published Aug 26, 2023, 7:40 AM IST

భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ యువరాజ్ సింగ్ మళ్లీ తండ్రయ్యాడు. భార్యాఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. తన ఆనందాన్ని పంచుకున్నాడు. అతని భార్య హేజల్ కిచ్ రెండోసారి ఆడపిల్లకు జన్మనిచ్చింది. భార్య కొడుకు, పాపతో ఉన్న ఫోటోలు యువరాజ్ సింగ్ శుక్రవారం నాడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.

కూతురు పేరు ‘ఆరా’ అని పెట్టినట్లుగా రాసుకు వచ్చాడు…ఈ పోస్ట్ కు కామెంట్ రాస్తూ… ‘యువరాణి ఆరాకు స్వాగతం. నిద్రలేని రాత్రులు ఆనందగడియలుగా మారాయి. తన రాకతో మా కుటుంబం పరిపూర్ణమయింది’’  అంటూ యువరాజ్ సింగ్ రాసుకొచ్చాడు. 

2016లో హేజిల్ కీచ్ - యువరాజ్ సింగ్ కు పెళ్లైంది. నిరుడు కొడుకు ఒరియాన్ పుట్టాడు. 2019లో యువరాజ్ సింగ్  క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.  ఈ విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios