Asianet News TeluguAsianet News Telugu

మీ దగ్గర బంగారం ఉందా ? వేంటనే డబ్బు కావాలంటే మంచి టైం..

హోం లేదా పర్సనల్  లోన్ లాగ కాకుండా వీటికి క్రెడిట్ చెక్ అవసరం లేదు. బ్యాంకులు మొదట తాకట్టు పెట్టిన బంగారం విలువ, స్వచ్ఛతకు సంబంధించినవి చూస్తాయి. 
 

do you have  gold? This is the best time to take a loan; Know interest rates charged by major banks-sak
Author
First Published May 15, 2024, 7:34 PM IST

హోం లోన్ వంటి ఇతర లోన్స్ లాగ కాకుండా గోల్డ్  లోన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇన్స్టంట్  లోన్  అప్రూవల్, మినిమం  డాకుమెంట్స్ మాత్రమే  బంగారు రుణాలకు ప్లస్ పాయింట్.
 
గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు

గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 8.25% నుండి 18% వరకు ఉంటాయి. బ్యాంకులపై ఆధారపడి  6 నుండి 36 నెలల వరకు ఉంటుంది. మీరు బ్యాంక్ వెబ్‌సైట్‌ల ప్రకారం వివిధ బ్యాంకుల తాజా బంగారు రుణాల వడ్డీ రేట్లను తనిఖీ చేయవచ్చు.

SBI 12 నెలల బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ పథకం కింద 8.65% వడ్డీ రేటును ఛార్జ్ చేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు ప్రస్తుతం 9.25%. బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9.15%. HDFC బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 9.00% నుండి ప్రారంభమవుతాయి. ఐసిఐసిఐ బ్యాంక్ బంగారు రుణాలపై 9% వడ్డీని వసూలు చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ బంగారు రుణాలపై 9.30 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి గోల్డ్ లోన్  చాలా ఉపయోగపడుతుంది. హోమ్ లోన్ లేదా పర్సనల్  లోన్ లాగా కాకుండా, వీటికి క్రెడిట్ చెక్ అవసరం లేదు. బ్యాంకులు మొదట తాకట్టు పెట్టిన బంగారం విలువ, స్వచ్ఛతకు సంబంధించినవి చూస్తాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios