టీమిండియా ప్రధాన కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్?... రాహుల్ ద్రవిడ్ ను ఈ సీఎస్కే స్టార్ భ‌ర్తీ చేస్తాడా?

Team India : భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కాంట్రాక్టు రాబోయే టీ20 ప్రపంచకప్ తో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలోనే ద్రవిడ్ స్థానంలో టీమిండియా ప్ర‌ధాన కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ క‌స‌ర‌త్తులు ప్రారంభించింది.
 

Stephen Fleming To Become India's Head Coach? Will this CSK star replace Rahul Dravid? What is BCCI thinking? RMA

Team India Head Coach : కొత్త ప్రధాన కోచ్ కోసం భార‌త క్రికెట్ జ‌ట్టు వేట ప్రారంభమైంది. భార‌త లెజెండ‌రీ ప్లేయ‌ర్ రాహుల్ ద్ర‌విడ్ ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్ గా కొన‌సాగుతున్నారు. రాబోయే టీ20 ప్ర‌పంచ క‌ప్ తో ద్ర‌విడ్ కాంట్రాక్టు ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో బీసీసీఐ ప్ర‌ధాన కోచ్ కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ నుండి బాధ్యతలు స్వీకరించడానికి ఫ్లెమింగ్ ప్ర‌ధాన పోటీదారుగా ఉన్నాడు.

వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్ తర్వాత ద్ర‌విడ్ కాంట్రాక్ట్ ముగియ‌నుంది అయితే, మ‌రో అత‌ను దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. రాహుల్ ద్ర‌విడ్ సైతం ఇదే విష‌యాన్ని ఇప్ప‌టికే చెప్పిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే భారత జట్టు మూడు ఫార్మాట్లలో బాధ్యతలు స్వీకరించే కొత్త ప్రధాన కోచ్ కోసం వెతుకుతోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రధాన కోచ్ పాత్ర కోసం బీసీసీఐ సోమవారం అధికారికంగా దరఖాస్తులు కోరింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. 2009 నుండి చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌ధాన కోచ్‌గా ఉన్న ఫ్లెమింగ్ ప్ర‌ధాన కోచ్ రేసులో ఫ్రంట్-రన్నర్‌గా ఉన్నాడు.

ర‌స‌వ‌త్త‌రంగా ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు.. 2 స్థానాల కోసం 5 జ‌ట్ల ఫైట్.. ఛాన్సులు ఇలా ఉన్నాయి..

సానుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా అత్యుత్తమ ఆటగాళ్లను బయటకు తీసుకురావడానికి ఫ్లెమింగ్ మ్యాన్ మేనేజ్‌మెంట్ చక్కగా ఉండ‌టం,  చెన్నై సూప‌ర్ కింగ్స్ అందించిన సేవ‌ల‌తో అత‌ని విజయాల రేటు అతని సామర్థ్యాలకు భారీ రుజువులుగా ఉన్నాయి. అయితే 51 ఏళ్ల మాజీ స్టార్ ప్లేయ‌ర్ త‌న ఫ్రాంచైజీని విడిచిపెట్టాలనే విష‌యం గురించి సీఎస్కే మేనేజ్‌మెంట్‌తో చ‌ర్చించారా?  లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. ప్లెమింగ్ కోచ్ గా ఉన్న స‌మ‌యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియ‌న్ గా నిలిచింది. నాలుగు సంవత్సరాలు బిగ్ బాష్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు కోచ్‌గా కూడా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్, మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్‌గా కూడా ఉన్నాడు. ఫ్లెమింగ్ లీగ్‌లో ఎక్కువ కాలం పనిచేసిన కోచ్ గా, సీఎస్కేకు ఐదు టైటిల్స్, రెండు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలను అందించాడు.

ఐపీఎల్ 2024 నుంచి స్టార్ బౌల‌ర్ ఔట్..

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios