Asianet News TeluguAsianet News Telugu

దేవర నుండి ఫస్ట్ సాంగ్... ఆ పోస్టర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ!

ఎన్టీఆర్ జన్మదిన వేడుకలకు అభిమానులు సిద్దం అవుతుండగా వారి కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుంది. ఈ మేరకు దేవర మూవీ యూనిట్ సభ్యుల ప్రకటన కాకరేపుతుంది. 
 

ntr birthday special fear song from devara movie on may 19th ksr
Author
First Published May 15, 2024, 10:25 PM IST

మే 20న ఎన్టీఆర్ జన్మదినం. ఆయన 41వ ఏట అడుగిడనున్నారు. ఇది ఎన్టీఆర్ బర్త్ డే మంత్ కాగా... ఫ్యాన్స్ వేడుక కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆల్రెడీ సతీసమేతంగా విదేశాలకు వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఇక అభిమానుల కోసం ఎన్టీఆర్ తన అప్ కమింగ్ చిత్రాల నుండి అదిరిపోయే అప్డేట్స్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వనున్నాడు. ముఖ్యంగా దేవర నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది. 

ఫియర్ సాంగ్ తో ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ ఫిదా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ అప్డేట్ కి సంబంధించిన పోస్టర్ గూస్ బంప్స్ లేపేదిగా ఉంది. రక్తంతో తడిసిన మారణాయుధం చేతబట్టి ఉన్న ఎన్టీఆర్ లుక్ కాకరేపుతుంది. ఈ సినిమా థీమ్ మొత్తం బ్లాక్ డార్క్ షేడ్ లో ఉంది. వైలెన్స్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ  చూడని ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ పరిచయం చేస్తాడేమో చూడాలి. 

దేవర చిత్ర లేటెస్ట్ పోస్టర్ అనేక అంచనాలు పెంచేసింది. కాగా దేవర చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్-అనిరుధ్ కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ తెలియజేసేలా ఫియర్ సాంగ్ ఉండనుందని సమాచారం. మే 19న ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నారు. 

ఇక దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే వాదన ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. సమ్మర్ కి విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. 

ఎన్టీఆర్ నటిస్తున్న మరొక చిత్రం వార్ 2. ఈ భారీ మల్టీస్టారర్ లో మరొక హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. ఇటీవల ముంబైలో వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ ముంబైలో సందడి చేశాడు. అక్కడి మీడియా ఆయన వెనుకబడటం విశేషం. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 నుండి సైతం అప్డేట్ వస్తుందేమో చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios