DC vs LSG: అర్ష‌ద్ ఖాన్ సూప‌ర్ ఇన్నింగ్స్ వృధా.. ల‌క్నో పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ గెలుపు

DC vs LSG : ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్  లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓట‌మిపాలైంది. నికోల‌స్ పూర‌న్ సూప‌ర్ ఇన్నింగ్స్, చివ‌ర‌లో అర్ష‌ద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా అయ్యాయి. 
 

DC vs LSG: Arshad Khan's super innings wasted.. Delhi Capitals beat Lucknow Supergiants IPL 2024 RMA

IPL 2024, DC vs LSG: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 64వ మ్యాచ్ లో లక్నో సూప‌ర్ జెయింట్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్ లో ఓట‌మిపాలైంది. దీంతో ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్  గ‌ణాంకాలు ప్రతి మ్యాచ్ తర్వాత సంక్లిష్టంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. కెప్టెన్ రిషబ్ పంత్ గైర్హాజరీలో ఢిల్లీ చివరి మ్యాచ్‌లో ఓడిపోయింది, ఆ తర్వాత ఢిల్లీకి ప్లేఆఫ్ తలుపులు మూసుకుపోయినట్లే క‌నిపించింది. కానీ పంత్ తిరిగి వచ్చిన వెంటనే, ఢిల్లీ అద్భుతంగా పునరాగమనం చేసి లక్నోను 19 పరుగుల తేడాతో ఓడించి 14 పాయింట్లను పొందింది. ప్లేఆఫ్ ఛాన్స్ ల‌కు కోసం ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చినా.. లక్నో అవ‌కాశాల‌ను మాత్ర దెబ్బ‌తీసింది.

స్టబ్స్-పొరెల్ హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్.. 

లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన‌ ఢిల్లీకి ఆరంభం అద్భుతంగా ల‌భించింది. లక్నో తొలి ఓవర్‌లోనే సూప‌ర్ ఫామ్ లో ఉన్న ఆటగాడు జేక్ ఫ్రేజర్ వికెట్ పడగొట్టారు. కానీ, మరో ఎండ్‌లో యంగ్ ప్లేయ‌ర్ అభిషేక్ పోరెల్ ధాటిగా ఆడుతూ లక్నో  బౌలింగ్ ను చిత్తుచేశాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. అలాగే, ఈ మ్యాచ్‌లో షాయ్ హోప్ 38 పరుగులు చేశాడు. కెప్టెన్ పంత్ 33 పరుగులతో పెవిలియ‌న్ కు చేరిన త‌ర్వాత ట్రిస్టన్ స్టబ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవ‌లం 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసి ఢిల్లీకి 208 ప‌రుగుల భారీ స్కోరును అందించాడు.

ల‌క్నోను దెబ్బ‌కొట్టిన ఢిల్లీ బౌలర్లు..

209 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను ఢిల్లీ బౌలర్లు తమ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో దెబ్బ‌కొట్టారు. ఇషాంత్ శర్మ రాగానే లక్నో బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. డికాక్ (12), కెప్టెన్ రాహుల్ (5), దీపక్ హుడా (5)లకు పెవిలియన్ చేర్చాడు. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అయితే, డూ-ఆర్-డై మ్యాచ్‌లో నికోలస్ పూరన్ త‌న బ్యాట్ తో విధ్వంసం  సృష్టించాడు. కేవలం 27 బంతుల్లో 61 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. త‌న హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో 6 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. కానీ జట్టును గెలిపించడంలో సఫలం కాలేదు.

అర్షద్ ఖాన్ చివ‌ర‌లో ఢిల్లీకి చెమ‌ట‌లు ప‌ట్టించాడు.. 

ఢిల్లీ టెయిల్ బ్యాట్స్‌మెన్ అర్షద్ ఖాన్ లక్నో కు గెలుపుపై ఆశ‌లు రేపాడు. వికెట్లు ప‌డి క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో వ‌స్తువ‌స్తూనే బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డాడు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో ఫిఫ్టీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే మరో ఎండ్‌లో వికెట్లు పడటంతో ఆ జట్టు విజయం సాధించలేకపోయింది. అర్ష‌ద్ ఖాన్ త‌న 33 బంతుల్లో 55 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. కానీ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాడు. త‌న ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాదాడు.

 

 

DC VS LSG: లక్నో క‌ష్ట స‌మ‌యంలో నికోల‌స్ పూర‌న్ విధ్వంసం.. ఢిల్లీకి చెమటలు పట్టించాడు భయ్యా.. ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios