DC vs LSG: లక్నో క‌ష్ట స‌మ‌యంలో నికోల‌స్ పూర‌న్ విధ్వంసం.. ఢిల్లీకి చెమటలు పట్టించాడు భయ్యా.. !

DC vs LSG : ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ బెర్త్ కోసం లక్నో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్  లో ఎల్ఎస్జీ ప్లేయ‌ర్ నికోల‌స్ పూర‌న్ త‌న బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. వ‌రుసగా వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ స‌మ‌యంలో రికార్డు హాఫ్ సెంచ‌రీ కొట్టాడు.
 

DC vs LSG: Nicholas Pooran's super batting storm at a tough time..Half century in 20 balls Tata IPL 2024 RMA

Nicholas Pooran's super batting storm: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 64వ మ్యాచ్ లో లక్నో సూప‌ర్ జెయింట్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్.. బ్యాట‌ర్స్ రాణించ‌డంతో భారీ స్కోర్ సాధించింది. 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 208 ప‌రుగులు చేసింది. జెక్ ఫ్రెజర్ డకౌట్ కాగా, మరో యంగ్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ మరోసారి తన బ్యాట్ పవర్ ను చూపించాడు. 33 బంతుల్లో 58 పురుగుల తన ఇన్నింగ్స్ తో 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. షాయ్ హోప్ 38, రిషబ్ పంత్ 33 పరుగులు చేశారు. చివరలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపు ఇన్నింగ్స్  ఆడాడు. 57 పరుగుల తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 

ఛేజింగ్ లో చేతులెత్తేసిన లక్నో.. నికోలస్ పూరన్ సూపర్ ఇన్నింగ్స్..

209 పరుగులు భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు మంచి ఆరంభం లభించలేదు. వరుసగా వికెట్లు కోల్పోయింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో ఢిల్లీ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. క్రీజులోకి వస్తూవస్తూనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు.27 బంతులు ఎదుర్కొన్న నికోలస్ పూరన్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో  61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే, పూర‌న్ క్రీజులో ఉన్నంత సేపు స్టేడియం హోరెత్తింది. క్రికెట్ ల‌వ‌ర్స్ ప‌రుగుల వ‌ర్షంలో త‌డిసిపోయారు.

సూప‌ర్ ఫీల్డింగ్.. క‌ళ్లుచెదిరే క్యాచ్ ప‌ట్టిన కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకా ప్రశంసలు

 

 

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో టీమ్ కు మంచి ఆరంభం లభించలేదు. వచ్చిన ప్లేయర్లు వచ్చినట్టుగానే క్రీజులో ఎక్కువ సేపు నిలవలేక పెవిలియన్ బాట పట్టారు. తొలి ఓవర్ లోనే కేఎల్ రాహుల్ వికెట్ ను కోల్పోయింది. రాహుల్ 5 పరుగులు మాత్రమే చేశాడు. 3వ ఓవర్ లో క్విటన్ డికీక్, ఆ తర్వాత ఓవర్ లో స్టోయినిస్, 5వ ఓవర్ లో బదోనిలు  ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ధాటిగా ఆడాడు. కృనాల్ పాండ్యా 18 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో టీమ్ 7 వికెట్లు కోల్పోయి 149 ప‌రుగులు చేసింది.

IPL 2024 : మ్యాచ్ బాల్‌ను దొంగిలించిన కేకేఆర్ ఫ్యాన్.. చివ‌ర‌కు.. వీడియో

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios