భారత్-వెస్టిండిస్ ల మధ్య జరిగిన చివరి వన్డేలో టీంఇండియా ఘన విజయం సాధించింది. కేరళలోని తిరువనంతపురం  గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో చాలా ఏళ్ల తర్వాత జరిగిన ఈ అంతర్జాతీయ మ్యాచ్ లో భారత్ సమిష్టిగా రాణించి సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్ కేవలం 104 పరుగులకే కుప్పకూల్చిన భారత్...ఆ లక్ష్యాన్ని కేవలం 14.5 ఓవర్లలోనే చేధించింది. భారత్ తో ఆడిన మ్యాచుల్లో విండీస్ జట్టుకు ఇదే అతి తక్కువ స్కోరు.  

గతంలో 1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్ బౌలర్లు కేవలం 121 పరుగులకే విండీస్ ను కుప్పకూల్చింది. ఆ తర్వాత అంత తక్కువ స్కోరు మళ్లీ భారత్-విండీస్ ల మధ్య జరిగిన  మ్యాచుల్లో ఎప్పుడు నమోదు కాలేదు. తాజాగా ఐదో వన్డేలో అంతకంటే తక్కువ పరుగులు సాధించిన విండీస్ తన చెత్త రికార్డును తానే బద్దలుగొట్టుకుంది. 

ఈ మ్యాచ్ లో మొదట భాతర బౌలర్లు విజృంభించి విండీస్ బ్యాట్ మెన్స్ ని అసలు క్రీజులో కుదురుకోనివ్వలేదు. జడేజా తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రాచ ఖలీల్ అహ్మద్ లు తమ పదునైన బంతులతో విండీస్ ఆటగాళ్లను గడగడలాడించారు. ఆ తర్వాత లక్ష్య చేధనలో రోహిత్, కోహ్లీ తమదైన ఆటతీరుతో భారత్ ను విజయతీరాలకు చేర్చారు.  

మరిన్ని వార్తలు
కోహ్లీ సరసన రోహిత్... 2018లో మొదటి రెండు స్థానాలు కెప్టెన్, వైస్ కెప్టెన్లవే

 త్రివేండ్రం వన్డే: విండీస్ చిత్తు...వన్డే సీరిస్ భారత్ వశం

ముంబై వన్డే: అతిగా ప్రవర్తించిన భారత బౌలర్‌కు మందలింపుతో పాటు....

ఆ అనుమానాలు ఇప్పుడు లేవు.. రాయుడిపై రోహిత్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

కాల్పుల కేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ అరెస్ట్...

ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలుగొట్టిన రోహిత్....రెండూ సచిన్‌వే

ధావన్‌ను ఔట్ చేసి అతడి స్టైల్లోనే విండీస్ బౌలర్ సెలబ్రేషన్...

కోహ్లీకి అక్తర్ 120 సెంచరీల టార్గెట్

అలిగిన వార్నర్.. మ్యాచ్ మధ్యలో నుంచే వెళ్లిపోయాడు

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్