MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Finn Allen : ఇదెక్కడి మాస్ హిట్టింగ్ సామీ ! 303 స్ట్రైక్ రేట్ తో సెంచరీ

Finn Allen : ఇదెక్కడి మాస్ హిట్టింగ్ సామీ ! 303 స్ట్రైక్ రేట్ తో సెంచరీ

Finn Allen Century: టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో ఫిన్ అలెన్ విధ్వంసకర సెంచరీతో దక్షిణాఫ్రికాను చిత్తు చేశాడు. అలెన్ తుపాను సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 04 2026, 10:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోల్‌కతాలో ఫిన్ అలెన్ తుపాను
Image Credit : X/ICC

కోల్‌కతాలో ఫిన్ అలెన్ తుపాను

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సిక్సర్ల మోత మోగింది. టీ20 ప్రపంచకప్ 2026 మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ అరాచకం సృష్టించాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అలెన్ కేవలం తన బ్యాట్‌తోనే కాకుండా, ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేస్తూ, టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. ఫిన్ అలెన్ వీరవిహారంతో న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ కోల్పోయి 173 పరుగులు చేసి, 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

High-flyer Finn Allen with another monstrous six as New Zealand charge towards the final 😍
#T20WorldCup broadcast details 👉 https://t.co/NPykWM7qqYpic.twitter.com/xLf3cYdFQ6

— ICC (@ICC) March 4, 2026

25
ఆరంభం నుంచే అటాకింగ్ గేర్
Image Credit : AFP

ఆరంభం నుంచే అటాకింగ్ గేర్

లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ మొదటి ఓవర్ నుంచే ఎదురుదాడి ప్రారంభించారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ కేవలం 19 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది ఈ ప్రపంచకప్‌లో ఉమ్మడి వేగవంతమైన హాఫ్ సెంచరీగా నమోదైంది. మరోవైపు టిమ్ సీఫెర్ట్ కూడా దూకుడుగా ఆడుతూ 33 బంతుల్లో 58 పరుగులు చేసి రాబడ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 117 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి న్యూజిలాండ్ విజయానికి బలమైన పునాది వేశారు. ఈ సెమీఫైనల్ పోరులో వీరి భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ తీసింది.

Related Articles

Related image1
SA vs NZ : ఫిన్ అలెన్ ఊచకోత.. సౌతాఫ్రికా ఖతం ! ఫైనల్లో కివీస్ రికార్డుల వేట
Related image2
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
35
రికార్డుల వేటలో కివీస్ ఓపెనర్లు
Image Credit : Getty

రికార్డుల వేటలో కివీస్ ఓపెనర్లు

ఈ మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్లు పలు రికార్డులను తిరగరాశారు. పవర్ ప్లే ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు కావడం విశేషం. అలాగే, ఫిన్ అలెన్ - టిమ్ సీఫెర్ట్ జోడీ ఈ ప్రపంచకప్‌లో మొత్తం 463 పరుగులు జోడించి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక భాగస్వామ్య పరుగులు చేసిన జోడీగా ఇబ్రహీం జద్రాన్ - రహ్మానుల్లా గుర్బాజ్ (446 పరుగులు) రికార్డును అధిగమించారు. ఫిన్ అలెన్ కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నా, ఏమాత్రం తగ్గకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు.

45
తడబడిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. జాన్సెన్ ఒంటరి పోరాటం
Image Credit : X/ICC

తడబడిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. జాన్సెన్ ఒంటరి పోరాటం

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఒక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ప్రోటీస్ జట్టును మార్కో జాన్సెన్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. జాన్సెన్ కేవలం 30 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ (29) చక్కని సహకారం అందించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో రాచిన్ రవీంద్ర (2/29), మాట్ హెన్రీ (2/34), కోల్ మెకన్కీ (2/9) కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు.

55
ఫైనల్ కు చేరిన బ్లాక్ క్యాప్స్
Image Credit : X/ICC

ఫైనల్ కు చేరిన బ్లాక్ క్యాప్స్

ఈ భారీ విజయం ద్వారా న్యూజిలాండ్ అహ్మదాబాద్‌లో ఆదివారం జరగనున్న ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించి కివీస్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. మార్కో జాన్సెన్ వేసిన 13వ ఓవర్లో ఫిన్ అలెన్ వరుసగా 4, 6, 6, 4 బాది మ్యాచ్‌ను ముగించడంతో పాటు తన రికార్డు సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఫిన్ అలెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దక్షిణాఫ్రికా మరోసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేక టోర్నీ నుంచి అవుట్ అయింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో ఫిన్ అలెన్ మెరుపులే కనిపించాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
SA vs NZ : ఫిన్ అలెన్ ఊచకోత.. సౌతాఫ్రికా ఖతం ! ఫైనల్లో కివీస్ రికార్డుల వేట
Recommended image2
SA vs NZ : టిమ్ సీఫెర్ట్ మాస్ బ్యాటింగ్.. ప్రోటీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన కివీస్ కుర్రాడు
Recommended image3
Bumrah : ఒక్క వికెట్ పడితే.. బుమ్రా సంచలనం !
Related Stories
Recommended image1
SA vs NZ : ఫిన్ అలెన్ ఊచకోత.. సౌతాఫ్రికా ఖతం ! ఫైనల్లో కివీస్ రికార్డుల వేట
Recommended image2
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved