Asianet News TeluguAsianet News Telugu

మెల్ బోర్న్ వన్డే గెలుపుకు కారణాలివే: కేదార్ జాదవ్

ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే ఎదుర్కొని టీంఇండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఏ ఆసియా జట్టుకు సాధ్యం కాని ఆస్ట్రేలియా గడ్డపై  టెస్ట్ సీరిస్ సాధించడంతో పాటు వన్డే సీరిస్ ను కూడా కైవసం చేసుకుని  భారత జట్టు రికార్డు సృష్టించింది. అయితే వన్డే సీరిస్ గెలవడంలో నిర్ణయాత్మకంగా మారిని మెల్ బోర్న్ వన్డేను ధోని(144 నాటౌట్), కేదార్ జాదవ్‌(64 నాటౌట్) అత్యుత్తమ భాగస్వామ్యమే గెలిపించిందనడంలో అతిశయోక్తి లేదు. కీలక వికెట్లను కోల్పోయిన సమయంలో వీరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపించడమే కాదు సీరిస్ ను కూడా గెలిపించారు. 

kedar  jadhav respond on melbourne test
Author
Melbourne VIC, First Published Jan 19, 2019, 4:44 PM IST

ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే ఎదుర్కొని టీంఇండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఏ ఆసియా జట్టుకు సాధ్యం కాని ఆస్ట్రేలియా గడ్డపై  టెస్ట్ సీరిస్ సాధించడంతో పాటు వన్డే సీరిస్ ను కూడా కైవసం చేసుకుని  భారత జట్టు రికార్డు సృష్టించింది. అయితే వన్డే సీరిస్ గెలవడంలో నిర్ణయాత్మకంగా మారిని మెల్ బోర్న్ వన్డేను ధోని(144 నాటౌట్), కేదార్ జాదవ్‌(64 నాటౌట్) అత్యుత్తమ భాగస్వామ్యమే గెలిపించిందనడంలో అతిశయోక్తి లేదు. కీలక వికెట్లను కోల్పోయిన సమయంలో వీరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపించడమే కాదు సీరిస్ ను కూడా గెలిపించారు. 

ఈ ఇన్నింగ్స్ గురించి కేదార్ జాదవ్ తాజాగా స్పందిచాడు. ధోని‌తో కలిసి అంతసేపు ఆడటం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. ఆస్ట్రేలియాలో పర్యటనకు సెలెక్టయినప్పటికి ఇలా చివరి వరకు తుది జట్టులో చోటు లభించకపోవడం కాస్త నిరాశపర్చినా...ఈ ఒక్క మ్యాచ్‌ ఆ బాధను పూర్తిగా దూరం చేసిందన్నారు. ముఖ్యంగా ధోనితో కలిసి క్రీజులో ఉంటే చాలా నేర్చుకోవచ్చని తెలిపాడు. కేవలం ప్రత్యర్థి బౌలర్ వేసే బాల్ ను అంచనా వేయడమే కాదు ధోని ఆలోచనల్ని కూడా అర్థం చేసుకుని ఆడాల్సి వుంటుందని...దాని వల్ల తనలాంటి యువ క్రికెటర్లు చాలా నేర్చుకోవచ్చని జాదవ్ పేర్కొన్నాడు. 

ఇలా ఇద్దరం  కలిసి సమన్వయంతో  స్ట్రైక్ రొటేట్ చేసుకోవడం వల్ల  ఎక్కువ పరుగులు రాబట్టినట్లు తెలిపాడు. అయితే అవసరమైనప్పుడు మాత్రమే బంతిని బౌండరీకి పంపడానికి ప్రయయత్నించానని...ధోని కూడా అదే సలహా  ఇచ్చాడని జాదవ్ వెల్లడించాడు. ఇలా ఆడటం వల్లే చివరి నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించినట్లు జాదవ్ పేర్కొన్నాడు.   

ఇక వరల్డ్ కప్ కు ముందు ఇలా చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడం భారత క్రికెటర్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని జాదవ్ అన్నాడు. ఈ విజయవంతమైన జట్టులో తనకు స్ధానం లభించినందుకు చాలా గర్వంగా వుందన్నారు. ప్రపంచ  కప్ లో కూడా భారత జట్టు ఇలాంటి విజయాన్నే సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు కేదార్ జాదవ్ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

రిటైర్మెంట్‌పై మరోసారి స్పందించిన ధోని...(వీడియో)

మెల్బోర్న్ వన్డే: వివాదంగా మారిన భువీ బంతి, ఫించ్ పై ప్రతీకారం

సచిన్ ను కెలికి ధోనీని ఆకాశానికెత్తిన రవిశాస్త్రి

ఓటమికి ధోనీనే కారణం, మా తప్పిదమే..ఆసిస్ కోచ్

ఏ స్థానంలోనైనా నేను రెడీ: ధోనీ ఆత్మవిశ్వాసం

అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు

మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్

2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

Follow Us:
Download App:
  • android
  • ios