ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనను విజయవంతంగా ముగించింది భారత జట్టు. ఈ పర్యటనలో చివరిదైన మెల్ బోర్న్ వన్డేలో గెలిచి ఆసిస్ గడ్డపై వరుసగా టెస్ట్, వన్డే సీరిస్ గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అయితే వన్డే సీరిస్ గెలుపును నిర్ణయించే చివరి వన్డేలో మొదట బౌలింగ్ లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అద్భుతాలు సృష్టించగా, బ్యాటింగ్ లో మహేంద్ర సింగ్ ధోని ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు కలిసి  సమన్వయంతో ఆస్ట్రేలియాకు చెందిన కీలక బ్యాట్ మెన్ ను ఔట్ చేసి ఔరా అనిపించారు. 

గత మ్యాచ్ లో సెంచరీతో రాణించిన ఆస్ట్రేలియా బ్యాట్ మెన్ ను చాహల్, ధోనిలు కలిసి అత్యంత చాకచక్యంగా ఔట్ చేశారు.  చాహల్ వేసిన వైడ్ బంతిని ముందుకొచ్చి ఆడబోయిన మార్ష్ ను ధోని చురుకైన స్టంపింగ్ తో ఔట్ చేశాడు. దీంతో అప్పటికే 39 పరుగులు సాధించి ప్రమాదకరంగా  మారుతున్న మార్ష్ పెవిలియన్ బాట పట్టాడు. ఇలా చాహల్, ధోనిల సమన్వయం కారణంగా మార్ష్ వికెట్ పడగొట్టారు.   

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ దెబ్బకు మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్‌ విలవిల్లాడింది.  ఈ మ్యాచ్‌లో చాహల్ (6/42) దెబ్బకి  ఆస్ట్రేలియా జట్టు కేవలం 230 పరుగులకే కుప్పకూలిపోయింది.

ఆస్ట్రేలియా నిర్ధేశించిన 231 పరుగుల లక్ష్యాంతో బరిలోకి దిగిన భారత జట్టును మహేంద్ర సింగ్ ధోని తన అద్భుత బ్యాటింగ్ తో విజయ తీరాలకు చేర్చాడు. అతను 114 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోనికి తోడుగా కేదార్ జాదవ్ 57 బంతుల్లో 61 పరుగులు చేశాడు.  దీంతో భారత్ ఆస్ట్రేలియా తన ముందు ఉంచిన 231 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.భారత్ 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.  

సంబంధిత వార్తలు

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్