MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?

T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?

Abhishek Sharma : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు ముందు అభిషేక్ శర్మ పేలవ ఫామ్ భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. కివీస్‌తో పోరులో అతడికి చోటు దక్కుతుందా లేదా అనేదానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 06 2026, 11:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అభిషేక్ శర్మ ఫామ్ పై ఆందోళన: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో చోటు దక్కేనా?
Image Credit : Getty

అభిషేక్ శర్మ ఫామ్ పై ఆందోళన: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో చోటు దక్కేనా?

టీమిండియా యువ ఓపెనర్, ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుత ఫామ్ ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2026 టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్, టోర్నమెంట్ కీలక దశకు వచ్చేసరికి తడబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 8న అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

26
ఆఫ్ స్పిన్నర్ల ఉచ్చులో అభిషేక్ శర్మ
Image Credit : Getty

ఆఫ్ స్పిన్నర్ల ఉచ్చులో అభిషేక్ శర్మ

ఈ టోర్నీలో అభిషేక్ శర్మ బలహీనత స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు అతడిని కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో అభిషేక్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు అతను ఆఫ్ స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో కేవలం 107.40 స్ట్రైక్ రేట్‌తో, 9.66 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. స్లో బంతులను ఎదుర్కోవడంలో అతని బ్యాట్ డౌన్‌స్వింగ్ వేగం అతడికి ఇబ్బందిగా మారుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Related Articles

Related image1
T20 World Cup 2026: టీమిండియా బౌలర్లకు ఏమైంది? ఫైనల్ ముందు సూర్యకుమార్ టెన్షన్ !
Related image2
T20 World Cup 2026: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ రద్దయితే విజేత ఎవరో తెలుసా?
36
అభిషేక్ శర్మ కు ఏమైంది? ఒక్క అర్థసెంచరీ మినహా..
Image Credit : Getty

అభిషేక్ శర్మ కు ఏమైంది? ఒక్క అర్థసెంచరీ మినహా..

ప్రస్తుత వరల్డ్ కప్‌లో అభిషేక్ గణాంకాలు చూస్తే నిరాశే ఎదురవుతుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో (అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్) అతను ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. అనారోగ్యం కారణంగా నమీబియా మ్యాచ్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాపై 15 పరుగులు చేయగా, జింబాబ్వేపై మాత్రమే 55 పరుగులతో రాణించాడు. అయితే, ఆ ఊపును కొనసాగించలేక వెస్టిండీస్‌పై 10, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో కేవలం 9 పరుగులకే వెనుదిరిగాడు. మొత్తంగా 7 మ్యాచ్‌ల్లో 12.71 సగటుతో 89 పరుగులు మాత్రమే చేశాడు.

46
శాంసన్ దూకుడు.. అభిషేక్ శర్మకు పై విమర్శలు
Image Credit : Getty

శాంసన్ దూకుడు.. అభిషేక్ శర్మకు పై విమర్శలు

టోర్నీ ఆరంభంలో అభిషేక్ శర్మపై గంపెడంత ఆశలు ఉండగా, సంజూ శాంసన్ స్థానంపై విమర్శలు వచ్చాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ మ్యాచ్‌ల్లో సంజూ అద్భుత ప్రదర్శన చేయడంతో అందరి దృష్టి అభిషేక్ పేలవ ఫామ్‌పై పడింది. మరోవైపు రింకూ సింగ్ వంటి ప్రతిభావంతుడు బెంచ్‌కే పరిమితం కావడం చర్చకు దారితీస్తోంది. అయితే రింకూను జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ తారుమారయ్యే అవకాశం ఉంది, అందుకే మేనేజ్‌మెంట్ వెనకాడుతోందని సమాచారం.

56
అభిషేక్ ను తొలగించొద్దు కానీ మాట్లాడండి : అశ్విన్
Image Credit : AFP

అభిషేక్ ను తొలగించొద్దు కానీ మాట్లాడండి : అశ్విన్

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ యాష్ కీ బాత్ లో అభిషేక్ శర్మకు అండగా నిలిచారు. ఫైనల్ మ్యాచ్‌లో అతడిని తొలగించవద్దని సూచించారు. "అభిషేక్ అద్భుతమైన టాలెంట్. గతంలో అతను శాంట్నర్, మ్యాట్ హెన్రీ వంటి బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. కాబట్టి అతడిని తప్పించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రత్యర్థి జట్లు నీ కోసం ప్లాన్ చేస్తున్నాయని అతడికి మేనేజ్‌మెంట్ వివరించాలి. ఇంగ్లాండ్‌పై జ్యాక్స్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన తర్వాత కూడా అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకోవడం బాధ్యతారాహిత్యం" అని అశ్విన్ పేర్కొన్నాడు.

66
ఫైనల్ పోరుకు మేనేజ్‌మెంట్ ప్లాన్ ఏంటి?
Image Credit : Getty

ఫైనల్ పోరుకు మేనేజ్‌మెంట్ ప్లాన్ ఏంటి?

కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గెలిచే జట్టులో మార్పులు చేసేందుకు ఇష్టపడరని తెలుస్తోంది. అందుకే అభిషేక్ శర్మకు ఫైనల్‌లో మరో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అయితే, కివీస్ బౌలర్లు అతడిని తక్కువ స్కోరుకే కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉంటారు. తన సహజసిద్ధమైన టైమింగ్‌తో ఆడే అభిషేక్, ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటేనే ఫైనల్‌లో రాణించే అవకాశాలు ఉంటాయి. జట్టు విజయం సాధించాలంటే ఓపెనర్లు శుభారంభం ఇవ్వడం ఎంతో ముఖ్యం. మరి అభిషేక్ తన తప్పులను సరిదిద్దుకుని మెరుస్తాడో లేదో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ రద్దయితే విజేత ఎవరో తెలుసా?
Recommended image2
IND vs NZ : ఒక్క మ్యాచ్.. 3 వరల్డ్ రికార్డులు ! ప్రపంచ క్రికెట్‌లో భారత్ బాహుబలి
Recommended image3
IND vs NZ : ఫైనల్లో సంజూ శాంసన్ సెంచరీ.. కప్పు మనదే బాసూ.. ఇదీ అసలు లెక్క !
Related Stories
Recommended image1
T20 World Cup 2026: టీమిండియా బౌలర్లకు ఏమైంది? ఫైనల్ ముందు సూర్యకుమార్ టెన్షన్ !
Recommended image2
T20 World Cup 2026: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ రద్దయితే విజేత ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved