తాము ఓడిపోవడానికి టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే కారణమని ఆసిస్ టీం కోచ్  జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డారు. భారత్-ఆసిస్ మధ్య జరిగిన వన్డే సిరిస్ లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. తమ ఓటమిగల కారణాలను ఆసిస్ జట్టు కోచ్ వివరించారు.

‘మా ఆటగాళ్లు బాగానే ఆడారు.  కానీ 2-1తో సిరీస్‌ కోల్పోయాం. టెస్ట్‌ సిరీస్‌లానే ఈ సిరీస్‌ను గెలిచే అవకాశాలను చేతులారా చేజార్చుకుని ఓడిపోయాం. గొప్ప ఆటగాళ్లకు ఎప్పుడూ అవకాశం ఇవ్వద్దు. కానీ మా ఆటగాళ్లు అదే చేశారు. రెండు సార్లు ధోనిని ఔట్‌ చేసే అవకాశాన్ని చేజేతులారా చేజార్చుకున్నారు. ఇదే మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ సిరీస్‌లో మాకు కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. స్టోయినిస్‌ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్ ద్వారా రిచర్డ్సన్‌ వెలుగులోకి వచ్చాడు. అతను అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మిడిలార్డర్‌లో హ్యాండ్‌స్కోంబ్‌ ఆసాధారణ ప్రదర్శన కనబర్చాడు. షాన్‌ మార్ష్‌ సిరీస్‌ ఆసాంతం ఆకట్టుకున్నాడు. మాకు లభించిన అవకాశాలను అందుకోలేక ఓటమి పాలయ్యాం. మరోసారి ధోని అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతని ప్రదర్శన బ్యాటర్స్‌ అందరికి ఓ మార్గదర్శకత్వంలాంటింది.’ అని చెప్పుకొచ్చాడు. 

అనంతరం కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘ కోహ్లీని చూస్తే.. సచిన్ గుర్తొస్తున్నాడు. అప్పట్లో నేను సచిన్ ఆటను బాగా ఆస్వాదించేవాడిని. ఇప్పుడు కోహ్లీ ఆటను ఎంజాయ్ చేస్తున్నాను. అతను ఆడే షాట్స్ బాగుంటాయి. కోహ్లి, ధోని, రోహిత్‌ శర్మలు ఆల్‌టైం గ్రేట్‌ క్రికెటర్స్‌’’ అని పొగడ్తల వర్షం కురిపించారు. 

మరిన్ని సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి

ఏ స్థానంలోనైనా నేను రెడీ: ధోనీ ఆత్మవిశ్వాసం

అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు

మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్

2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్