Asianet News TeluguAsianet News Telugu

ఏ స్థానంలోనైనా నేను రెడీ: ధోనీ ఆత్మవిశ్వాసం

తాను ఫలానా స్లాట్ లోనే ఆడాలనే నియమం ఏమీ పెట్టుకోబోనని, జట్టు అవసరాలకు అనుగుణంగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ధోనీ చెప్పాడు.

MS Dhoni ready to bat at any slot
Author
Melbourne VIC, First Published Jan 19, 2019, 9:58 AM IST

మెల్‌బోర్న్: తాను బ్యాటింగ్ ఆర్డర్ లో ఓ స్థానంలోనైనా ఆడడానికి సిద్దంగా ఉన్నట్లు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. ఆస్ట్రేలియా మూడో వన్డే విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడాడు.

తాను ఫలానా స్లాట్ లోనే ఆడాలనే నియమం ఏమీ పెట్టుకోబోనని, జట్టు అవసరాలకు అనుగుణంగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ధోనీ చెప్పాడు. 14 ఏళ్లపాటు క్రికెట్ ఆడిన తర్వాత కూడా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనని చెప్పలేనన్నాడు. 

జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పాడు. ఆసీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోనీ నేడు జరిగిన ఫైనల్ వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు 

ఈ మ్యాచ్‌లో 114 బంతులు ఎదుర్కొన్న ధోనీ 6 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. మొత్తం మూడు వన్డేల్లోనూ అర్ధ సెంచరీలు బాదిన ధోనీ 193 పరుగులు చేశాడు. దాంతో టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.

సంబంధిత వార్తలు

అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు

మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్

2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

Follow Us:
Download App:
  • android
  • ios