ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సీరిస్‌లో టీఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అదరగొట్టాడు. మూడు వన్డేల్లోనూ హ్యాట్రిక్ హాప్ సెంచరీలతో చెలరేగిన ధోని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ  క్రమంలో అతడు వ్యక్తిగతంగా  కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 

ఈ వన్డే సీరిస్ మొత్తం రాణించిన ధోని ఆస్ట్రేలియా గడ్డపై 1000 పరుగులు సాధింంచిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. మెల్ బోర్న్ వన్డేలో 36 పరుగుల వద్ద ధోని ఈ రికార్డును నెలకొల్పాడు. మొత్తంగా ఇప్పటివరకు ఆసిస్ గడ్డపై ముగ్గురు భారతీయ ఆటగాళ్లు 1000 పరుగుల మైలురాయిని సాధించగా ధోని నాలుగవ ఆటగాడిగా వారి సరసన చేరాడు. 

ప్రస్తుతం టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో పాటు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ లు ఇప్పటివరకు ఈ 1000 పరుగుల రికార్డును సాధించారు. తాజాగా మెల్ బోర్న వన్డే ద్వారా ధోని కూడా ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 

అలాగే ఈ సీరిస్‌లో ధోని వరుసగా మూడు అర్థశతకాలు బాది మళ్లీ పామ్ లోకి వచ్చాడు. ఇక చివరి రెండు మ్యాచుల్లో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇవాళ్టి మ్యాచ్ లో కీలక సమయంలో బ్యాటింగ్ కు దిగి కేదార్ జాదవ్ సాయంతో కీలక ఇన్సింగ్స్ నెలకొల్పి విజయాన్ని అందించాడు. ధోని 114 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోనికి తోడుగా కేదార్ జాదవ్ 57 బంతుల్లో 61 పరుగులు చేశాడు.  దీంతో భారత్ ఆస్ట్రేలియా తన ముందు ఉంచిన 231 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.

వన్డే సీరిస్ లో అద్భుతంగా రాణిస్తూ మొదట సిడ్నీ వన్డేలో 51, అడిలైడ్ మ్యాచ్ లో 55నాటౌట్, ఇవాళ్టి మెల్ బోర్న్ వన్డేలో 87 నాటౌట్గా నిలిచాడు. ఇలా మొత్తం 193 పరుగులతో  మ్యాన్ ఆఫ్ ది సీరిస్ ను ధోని  గెలుచుకున్నాడు.

సంబంధిత వార్తలు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్