మెల్‌బోర్న్ ఎంసిజి మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీంఇండియా ఫేసర్ భువనేశ్వర్ కుమార్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆసిస్ విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్ వెల్‌ను తన అద్భుతమైన డైవింగ్ క్యాచ్ ద్వారా ఔట్ చేసి ఆసిస్ జట్టును తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా చేశాడు. ఇలా ఓవైపు తన ఫేస్ బౌలింగ్ తో రెండు వికెట్లు పడగొట్టి ...మరోవైపు అద్భుత ఫీల్డింగ్‌తో మరో కీలక వికెట్ పడగొట్టడంలో భువి భాగస్వామ్యం వహించాడు.

మూడు వన్డేల సీరిస్‌లో భాగంగా ఇప్పటివరకు రెండు వన్డేలు జరగ్గా అందులో ఆస్ట్రేలియా-భారత్‌లు చెరోటి గెలుచుకున్నాయి. దీంతో వన్డే సీరిస్ ఎవరి సొంతం కానుందో ఇవాళ జరుగుతున్న చివరి వన్డే నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్‌ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నాయి. 

 ఇలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మెల్ బోర్న్ వన్డేలో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 230 పరుగులకే ఆలౌటయ్యింది. ఇలా ఆసిస్ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో టీంఇండియా ఫేసర్ భువి పాత్ర మరువలేనిది. ఆస్ట్రేలియా ఓపెనర్లు అలెక్స్ క్యారీ, ఆరోన్ పించ్ లను భువి తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆదిలోనే ఔట్ చేశాడు. ఇలా కీలక ఆటగాళ్లు తొందరగా ఔటవడంతో ఒత్తిడిలో పడ్డి ఆసిస్ బ్యాట్ మెన్స్ కూడా తొందరగానే ఔటయ్యారు. దీంతో మొదటి రెండు వన్డేల్లో భారీ స్కోర్లు సాధించిన ఆసిస్ మూడో వన్డేలో మాత్రం తక్కువ స్కోరుకే పరిమితమవ్వాల్సి వచ్చింది. 

Scroll to load tweet…