మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కీలకమైన ఇన్నింగ్సు ఆడిన సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీని ప్రశంసించడానికి టీమిండియా కోచ్ రవిశాస్త్రి సచిన్ టెండూల్కర్ ను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీని ఆయన ఆకాశానికెత్తాడు.

భారత క్రికెట్‌  దిగ్గజాల్లో ఒకడిగా ధోనీ నిలుస్తాడని రవిశాస్త్రి కొనియాడాడు. డకౌట్‌ అయినా, సెంచరీ కొట్టినా, ప్రపంచ కప్‌ గెలిచినా, తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఒకే విధంగా స్వీకరించే ధోని స్వభావం తనను ఆశ్చర్యపరుస్తుందని అన్నాడు. 

దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గవాస్కర్‌ సహా విమర్శకులపై తనదైన శైలిలో ఆయన పరోక్షంగా మండిపడ్డాడు. ఓ ఆస్ట్రేలియా పత్రికకు రవిశాస్త్రి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. ఆటలో కొనసాగుతున్న కాలంలో సచిన్‌లో కోపాన్ని చూశాను గానీ ధోనిలో ఇంతవరకు అలాంటిదేమీ కనిపించలేదని అన్నాడు. 30–40 ఏళ్లకోసారి మాత్రమే ఇలాంటి ఆటగాళ్లు వస్తారని అన్నాడు. 
బ్యాట్స్‌మన్‌గానే కాకుండా మంచి వ్యూహకర్తగా ధోనీ కెప్టెన్‌ కోహ్లిపై భారం తగ్గిస్తాడని అభిప్రాయపడ్డాడు. కీపర్‌గా ఆటను అతడు చూసే కోణం వేరని, కుర్రాళ్లతో బాగా ఉంటాడని, డ్రెస్సింగ్‌ రూమ్‌లో వారంతా ధోనిని గొప్పగా చూస్తారని అన్నాడు. 

ఈ మొత్తం జట్టు అతడి సారథ్యంలోనే రూపుదిద్దుకుందని చెప్పాడు. ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని, అందుకే ధోని ఆడినంత కాలం ఆస్వాదించాలని తాను భారతీయులకు చెప్పదలుచుకున్నానని అన్నాడు.

సంబంధిత వార్తలు

ఓటమికి ధోనీనే కారణం, మా తప్పిదమే..ఆసిస్ కోచ్

ఏ స్థానంలోనైనా నేను రెడీ: ధోనీ ఆత్మవిశ్వాసం

అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు

మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్

2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్