Asianet News TeluguAsianet News Telugu

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

రోహిత్ శర్మ అభిప్రాయం విరాట్ కోహ్లీ అభిప్రాయానికి భిన్నమైంది. అయితే, అంబటి రాయుడు నాలుగో స్థానంలో బాగానే రాణిస్తున్నాడని రోహిత్ అభిప్రాయపడ్డాడు. కానీ, బ్యాటింగ్ ఆర్డర్ లో కెప్టెన్ దే తుది నిర్ణయమని అన్నాడు. 

Rohit Sharma differs with Virat kohli
Author
Sydney NSW, First Published Jan 13, 2019, 9:40 AM IST

సిడ్నీ: బ్యాటింగ్ ఆర్డర్ లో మహేంద్ర సింగ్ ధోనీ స్లాట్ పై కెప్టెన్ విరాట్ కోహ్లీతో వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ విభేదిస్తున్నారు. సిడ్నీ వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ధోనీ 51 పరుగులు చేశాడు. ధోనీని నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దింపితే బాగుంటుందని రోహిత్ శర్మ అన్నాడు.

రోహిత్ శర్మ అభిప్రాయం విరాట్ కోహ్లీ అభిప్రాయానికి భిన్నమైంది. అయితే, అంబటి రాయుడు నాలుగో స్థానంలో బాగానే రాణిస్తున్నాడని రోహిత్ అభిప్రాయపడ్డాడు. కానీ, బ్యాటింగ్ ఆర్డర్ లో కెప్టెన్ దే తుది నిర్ణయమని అన్నాడు. 

నాలుగో స్థానంలో ధోనీని దింపడం జట్టుకు మంచిదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే రాయుడు నాలుగో స్థానంలో బాగానే ఆడుతున్నాడని అన్నాడు. అయితే, కోచ్, కెప్టెన్ లదే తుది నిర్ణయమని అన్నాడు. వ్యక్తిగతంగా అయితే ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగితే మంచిదని భావిస్తానని అన్నాడు. 

ధోనీ స్ట్రయిటింగ్ రేట్ 90 ఉందని, శనివారం ఆటలో పరిస్థితి వేరని, ధోనీ బ్యాటింగ్ కు దిగేసరికే మూడు వికెట్లు కోల్పోయామని, ఆస్ట్రేలియా బౌలింగ్ బాగా చేస్తోందని, దానివల్ల వస్తూనే బాదుతూ 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం సులభం కాదని, అందువల్ల తాము కొంత సమయం తీసుకున్నామని, తాను కూడా సాధారణంగా ఆడే కన్నా కాస్తా నెమ్మదిగా ఆడానని రోహిత్ వివరించాడు. 

భాగస్వామ్యాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే తాను కాస్తా నెమ్మదిగా బ్యాటింగ్ చేశానని, ఆ స్తితిలో మరో వికెట్ కోల్పోతే అక్కడే ఆట ముగిసి ఉండేదని, దాంతో తాము డాట్ బాల్స్ ఆడుతూ భాగస్వామ్యాన్ని నెలకొల్పామని అన్నాడు. ధోనీ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రోహిత్ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అదే కొంప ముంచింది: ఓటమిపై కోహ్లీ రియాక్షన్

రిచర్డ్స్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

సచిన్ తర్వాత ఆస్థానం.. రోహిత్ శర్మదే..

సిడ్నీ వన్డే: రోహిత్ సెంచరీ వృధా...34 పరుగుల తేడాతో భారత్ ఓటమి

Follow Us:
Download App:
  • android
  • ios