సీ(స్క్రీ)న్ మారింది: మొన్న సింగల్ స్క్రీన్స్, నిన్న మల్టీప్లెక్సులు, నేడు ఓటిటి
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు వినోదం కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అలాంటి వారికి ఓటీటీ ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. సినిమాలకు ఏ మాత్రం తగ్గని క్వాలిటీలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు మల్టీ లాంగ్వేజెస్‌లో వెబ్ సిరీస్‌లను రూపొందిస్తున్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచ మానవ జీవితాల ముఖ చిత్రమే మార్చేస్తోంది. ఇక మీదట మానవ మనుగడను కరోనాకు ముందుకు కరోనాకు తరువాత అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏ రంగంలోనూ ముందున్న పరిస్థితులు భవిష్యత్తులో ఉండే అవకాశం కనిపించటం లేదు. ముఖ్యంగా వినోద రంగంపై కరోనా ప్రభావం భారీ స్థాయిలో ఉంది. మేకింగ్ నుంచి షోయింగ్ వరకు ప్రతీ స్థాయిలో కరోనా వినోద పరిశ్రమను కుదిపేస్తోంది.
కరోనాతో షూటింగ్ లు చేసే తీరు, సన్నివేశాల తీరు, ఆఖరికి సినిమాను పదర్శించే తీరు కూడా మారక తప్పని పరిస్థితి. గతంలోలా ప్రజలు గుంపులు గుంపులుగా థియేటర్లకు వెళ్లే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపించటం లేదు.
ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు వినోదం కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అలాంటి వారికి ఓటీటీ ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. సినిమాలకు ఏ మాత్రం తగ్గని క్వాలిటీలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు మల్టీ లాంగ్వేజెస్‌లో వెబ్ సిరీస్‌లను రూపొందిస్తున్నారు.
సినిమాలు సజావుగా ప్రదర్శిస్తున్న తరుణంలోనే ఓటీటీ మంచి మార్కెట్‌ను సొంతం చేసుకుంది. ఇక లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఓటీటీ మార్కెట్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో చాలా మంది నిర్మాతలు కూడా థియేటర్లకు బదులుగా తమ సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీలలో రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే ఆ దిశగా తొలి అడుగులు కూడా పడ్డాయి. ఎన్నో అవాంతరాల తరువాత జ్యోతిక నటించిన పొన్‌మగల్ వందాల్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీలలో రిలీజ్ చేయటంపై థియేటర్ల యాజమాన్యాలు మాత్రం గుర్రుగా ఉన్నారు. ఆ విషయంలోనే పోన్‌మగల్ వందాల్ నిర్మాత సూర్యకు థియేటర్ల ఓనర్లకు పెద్ద యుద్ధమే జరిగింది.
అయితే సామన్య ప్రేక్షకుడు మాత్రం ఓటీటీలకే ఓటేస్తున్నాడనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు థియేటర్లు ఓపెన్ చేసినా ప్రజలు ఎంతవరకు వెళతారన్నది అనుమానమే. అందుకే ఇంటి పట్టునుండే తమకు కావాల్సిన వినోదం పొందేలా ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు.
ఖర్చు పరంగా కూడా ఓటీటీలే బెటర్ అని భావిస్తున్నారు సామాన్య ప్రేక్షకులు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మల్టీప్లెక్స్‌లో కుటుంబ సమేతంగా సినిమా చూడాలంటే రూ.1500 వరకు ఖర్చు చేయాల్సిందే. అదే రూ.1500లతో ఓటీటీలో ఏడాది అంతా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువ మంది ప్రజలు ఓటీటీలకే మొగ్గు చూపుతున్నారు.
ఇప్పుడే కాదు చాలా ఏళ్ల క్రితమే కమల్ ఈ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చాడు. థియేట్రికల్ రిలీజ్‌తో పాటు డిజిటల్‌లోనూ అదే సమయంలో రిలీజ్ చేస్తే కరెక్ట్ అన్న ప్రతిపాదన తెచ్చాడు. కానీ ఆ సమయంలో కమల్ ఆలోచనను డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇటీవల పీవీఆర్ లాంటి అగ్ర సంస్థలు కూడా సినిమాలో డైరెక్ట్‌గా డిజిటల్‌లో రిలీజ్ చేస్తే నిర్మాతలతో తమ సంబంధాలు దెబ్బతింటాయని బెదిరింపు ధోరణిలో ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకోవాలో పాలుపోక సందిగ్ధంలో ఉండిపోయారు.
మార్పు అనేది జీవన గమనంలో ఒక భాగం. జీవితంలో మార్పును స్వాగతించాల్సిందే. సాంకేతికత, నూతన ఒరవదులు, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ముందుకు సాగవలిసిందే. సింగల్ స్క్రీన్ థియేటర్ల నుంచి ముల్టీప్లెక్సుల వైపుగా ఎలా మరలామో, ఇప్పుడు కరోనా మహమ్మారి పుణ్యమాని మనం ఒటిటి ప్లాట్ ఫార్మ్ వైపుగా వెళ్లసిందే. జీవన గమనం అంతే. సినిమా పరిశ్రమ బ్రతికి ఉండాలంటే ఆర్పును ఆకళింపు చేసుకోక తప్పని పరిస్థితి.
ఏది ఏమైనా ఈ ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లకు జనం ఓటేస్తున్నారు అనడంలో సందేహం లేదు. మరి పరిణామాలు సినీ పరిశ్రమను ఏ దిశగా నడిపిస్తాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.