- Home
- Andhra Pradesh
- TTD : ఎవరి రికమండేషన్లు అవసరం లేదు.. 2 గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం.. తిరుమలలో సంచలన మార్పులు
TTD : ఎవరి రికమండేషన్లు అవసరం లేదు.. 2 గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం.. తిరుమలలో సంచలన మార్పులు
Tirumala Tirupati Devasthanam (TTD) : తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

Tirumala
Tirumala Tirupati Devasthanam (TTD) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి తిరుమల ఆలయ నిర్వహణ, దాని సౌకర్యాలను మెరుగుపరచడానికి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి దర్శనం విషయంలో సామాన్యులకు గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయంలు తీసుకుంది. తిరుమలేశుని దర్శనం కోసం ఇప్పుడు గంటలు గంటలు క్యూలైన్లో నిల్చోవాల్సిన పనిని తగ్గించనుంది టీటీడీ.
తిరుమలలో రాజకీయ చర్చలపై నిషేధం, అతిథి గృహాలకు ఆ పేర్లకు నో
తిరుమల ఆలయ ప్రాంగణంలో రాజకీయ చర్చలపై నిషేధం విధిస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయం ఆధ్యాత్మికతపై దృష్టి సారించి, రాజకీయ ప్రభావం లేకుండా ఉండేలా చూడాలని టీటీడీ కోరింది. రాజకీయ అంశాలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
అలాగే, అతిథి గృహాలకు వ్యక్తిగత పేర్లు ఉండవనే నిర్ణయాలు కూడా తీసుకుంది. తిరుమలలోని అతిథి గృహాలకు వ్యక్తిగత, రాజకీయ పేర్లను పెట్టరాదని టీటీడీ నిర్ణయించింది. ఈ నియమం ఆలయ సముదాయ సాంప్రదాయ, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడే లక్ష్యంతో ఉన్న విషయాలను స్పష్టం చేసింది.
Tirumala
రెండు మూడు గంటల్లోనే శ్రీవారి సర్వ దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో దర్శనాలు ఒకటి. ఇక నుంచి వీలైనంత త్వరగా భక్తులకు శ్రీవారి దర్శనం కోసం తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు టీటీడీ తెలిపింది.
సుదీర్ఘ నిరీక్షణ సమయం గురించి పెరుగుతున్న ఆందోళన మధ్య TTD సర్వదర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు 2-3 గంటల్లో వారి దర్శనం (శ్రీవారి దర్శనం) కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది. సర్వదర్శనంతో పాటు అన్ని దర్శనాల సమయం తగ్గించడానికి టెక్నాలజీ సాయం తీసుకుంటామనే నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం సామన్యులతో పాటు అందరూ వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, యాత్రికులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి సహాయపడుతుంది.
సామాన్య భక్తులకు వేగంగా తిరుమలేషుని దర్శనం కల్పించడానికి అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వర్చువల్ లైన్లు ఏర్పాటు చేసి.. కేవలం రెండుమూడు గంటల్లోనే తిరుమల శ్రీనివాసుని దర్శనం కల్పించడానికి అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
శారదా పీఠం లీజు రద్దు-హిందూయేతరుల సేవలకు స్వస్తి
విశాఖపట్నంలోని శారదా పీఠం లీజు ఒప్పందాన్ని రద్దు చేస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అదనంగా, శారదా పీఠం భవనాన్ని నేరుగా నిర్వహించడానికి టీటీడీ పూర్తి నియంత్రణను తీసుకోవాలని భావిస్తోందని తెలిపారు.
<p><strong>ttd</strong></p>
హిందూయేతర ఉద్యోగులకు సేవల ముగింపు పలకాలని కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆలయంలో పనిచేస్తున్న హిందూయేతర మతాలకు చెందిన ఉద్యోగుల సేవలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిర్ణయం ఆలయ సిబ్బంది సంస్థ మతపరమైన, ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు తీసుకున్నారు. బోర్డు తీసుకున్న నిర్ణయాలు తిరుమల పవిత్రతను నిలబెట్టడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, మొత్తంగా భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినవిగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.