ఉరి శిక్ష విధించేటప్పుడు సాధారణంగా జడ్జి తన తీర్పును వెలువరిస్తూ... "హ్యాంగ్డ్ టు డెత్" అని రాస్తారు. అంటే దానర్థం మరణించేంత వరకు ఉరి తీయాలని. వాస్తవానికి ప్రపంచంలో ఇంతకు పూర్వం ఉరి వేయమని మాత్రమే తీర్పు వెలువరించేవారు. 

భారతదేశంలోని ప్రముఖ న్యాయవాది, స్వతంత్ర సమరయోధుడు, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు తండ్రి మోతిలాల్ నెహ్రు ఇచ్చిన ఒక స్వీట్ షాక్ దెబ్బకు అప్పట్లో భారతదేశంలోని బ్రిటిషు ప్రభుత్వం ఖంగు తిన్నది. ఈయన అపార మేధస్సును అర్థం చేసుకొని తమ తీర్పులోని డొల్లతనాన్ని సరిచేసుకున్నారు. 

Also read; ఉరిశిక్ష: నాథూరామ్ గాడ్సే నుండి నిర్భయ దోషుల వరకు ......

వివరాల్లోకి వెళితే బ్రిటిషర్లు భారత దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో అప్పుడప్పుడే అతివాదులు ప్రబలంగా తమను తాము చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమని వారు హీరోయిక్స్ కోసం బ్రిటిషు అధికారులపైనా దాడులు చేయడం మొదలుపెట్టారు. 

ఇలాంటి ఒక కేసులో బ్రిటిషు అధికారి ఒకరు ఒక యువ స్వతంత్ర ఉద్యమకారుడిని జనాలందరూ చూస్తుండగా పబ్లిక్ గా ఉరి తీయాలని ఆదేశించాడు. ఒకరిని గనుక ఇలా చేస్తే... మిగిలిన వారంతా సెట్ రైట్ అయిపోతారనేది ఆ జడ్జి భావన. 

ఆ భారతీయ యువకుడి తరుఫున కేసు వాదిస్తుంది ప్రముఖ న్యాయవాది మోతిలాల్ నెహ్రు. ఆయన డిఫెన్సె లాయర్ గా ఉండి కూడా ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోవడం అందరిని విస్మయానికి గురి చేసింది. ఆయన అంత తేలికగా ఇలా ఉరి శిక్షకు ఒప్పుకోవడం ఏమిటని ఆ జడ్జీయే ఆశ్చర్యపోయాడు. 

తీర్పు వెలువరించడం పూర్తయిన తరువాత ఉరి తీసే తేదీ రానే వచ్చింది. ఆ రోజు ఆ యువకుడిని అందరి మధ్య బహిరంగంగా ఉరి తీయడానికి తీసుకువచ్చారు. ప్రజలంతా చూస్తున్నారు. ఆ జనల మధ్య మోతిలాల్ నెహ్రు కూడా ఉన్నారు. 

Also read: చట్టంలోని లొసుగులు ఇవీ: నిర్భయ దోషులు ఎలా వాడుకున్నారంటే...

అందరూ చూస్తుండగా అతడిని ఉరి తీశారు. తలారి అతడికి ఉరి వేసి అతడు కొట్టుకుంటుండగా... మోతిలాల్ నెహ్రు తన మనుషులను పంపించి ఆ యువకుడి కళ్ళను పట్టుకోవాలిసిందిగా ఆదేశించాడు. వెంటనే అక్కడే ఉన్న మెజిస్ట్రేట్ ఏమిటి అని అరిచాడు. దానికి మోతిలాల్ నెహ్రు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. 

తీర్పులో హ్యాంగ్డ్ అని మాత్రమే ఉందని, అతడిని ఉరి తీయడం జరిగిపోయిందని అన్నాడు. ఒక్కసారిగా అక్కడున్న మెజిస్ట్రేట్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసును ఛాలెంజ్ చేసాడు. కోర్టులో మోతిలాల్ నెహ్రు వాదనే నెగ్గింది. 

ఏ మనిషికైనా చేసిన తప్పుకు ఒకేసారి శిక్ష విధించాలనేది న్యాయసూత్రం. డబల్ జియోపార్డీ ఉండకూడదు అన్నది సిద్ధాంతం. దానితో మోతిలాల్ నెహ్రు వాదన నెగ్గడమే కాదు, ఆయువకుడిని కూడా విడుదల చేసింది న్యాయస్థానం. 

తమ తప్పును తెలుసుకున్న న్యాయస్థానం అప్పటి నుండి హ్యాంగ్డ్ ఆన్టిల్ డెత్ అని తీర్పును వెలువరిస్తున్నారు. ఇలా మరణించే వరకు ఉరి తీయండి అని తీర్పు రావడానికి ఇదొక్కటే కాకుండా అనేక కారణాలను కూడా చెబుతారు.

జోసెఫ్ సామ్యూల్ కేసు తర్వాత ఆడ్ చేసారు అని వాదించేవారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా సాధారణంగా ఉరి శిక్ష అనే వెలువరించే తీర్పు పక్కన ఇలా చచ్చేంత వరకు ఉరి తీయండి అని రాయడంలో మనవాడు పాత్ర ఉండడం గొప్పకారణం