Asianet News TeluguAsianet News Telugu

పండగ వేళ రుణం తీసుకుంటున్నారా?

  • బ్యాంకులు ఒక రూపాయిని మనకు ఇచ్చేప్పుడు.. అన్ని నిబంధనలనూ తనకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటుంది
  • పండగ సందర్భంగా బోనస్‌ వస్తుందనో, మరేదో మార్గంలో సొమ్ము వస్తుందనో పెద్ద మొత్తంలో కార్డు ద్వారా ఎక్కువ శాతం మంది కొనుగోలు చేస్తుంటారు
should you go for festive season loan offers

దసరా.. దీపావళి పండగల సీజన్ వచ్చేసింది. ఈ పండగ కాలంలో అన్ని బట్టల దుకాణాలు, మొబైల్ షోరూమ్స్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అదేవిధంగా బ్యాంకులు కూడా కొన్ని ఆఫర్లు ప్రకటిస్తాయి. ప్రజలను ఆకర్షిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. అందులో భాగంగానే వడ్డీలేకుండా రుణం ఇస్తాం. ఇప్పుడు కనుక మీరు లోన్ కి అప్లై చేసుకుంటే వెంటనే లోన్ ఇస్తాం.. ఇలా ఏవేవో ఆఫర్లు ప్రకటిస్తూ లోన్లు ఇస్తామంటారు. ముఖ్యంగా హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, గోల్డ్, పర్సన్ లోన్స్ ఆఫర్ చేస్తారు. మరి అలాంటి సమయంలో ఏమి చేయాలి. లోన్ తీసుకోవాలా తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సందేహాలు మీకు ఉన్నాయా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

ఎంతో తొందరగా రుణం ఇస్తామని చెప్పినా.. బ్యాంకులు ఒక రూపాయిని మనకు ఇచ్చేప్పుడు.. అన్ని నిబంధనలనూ తనకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటుంది. ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టదు. ఇక్కడ అప్పు తీసుకునే తొందరలో రుణ గ్రహీతలే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇబ్బందుల్లో పడుతుంటారు. కాబట్టి ఈ రుణాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి.

ఫెస్టివల్ లోన్ అర్హత..

సాధారణంగా మనకు ఏదైనా లోన్ రావాలంటే.. కనీస అర్హతలు ఉండాలి. అంటే మీకు వచ్చే ఆదాయం, మీరు చేసే ఉద్యోగం, ఉద్యోగంలో అనుభవం, మీ వయసు.. ఇలా అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఈ ఫెస్టివల్ సీజన్ లో ఇచ్చే లోన్ లో మీ తోపాటు మీ జీవిత భాగస్వామి వివరాలు కూడా తీసుకుంటారు. రుణం పొందడానికి మీరు అర్హులైతే.. వ్యక్తిగత రుణం ఇవ్వడానికి బ్యాంకులు చాలా నియమాలు విధిస్తాయి. అంతేకాదు.. వ్యక్తిగత రుణం పొందాలంటే మీ ఆదాయ ప్రమాణాలను ఎక్కువగా చూపించాల్సి ఉంటుంది. అయితే... ఫెస్టివల్ లోన్ విషయంలో మాత్రం అలా ఉండదు. అందుకే చాలా మంది  సులభంగా పొందేందుకు రూ.50వేల వరకు మాత్రం రుణాన్ని ఆశిస్తారు.

 

క్రెడిట్ కార్డ్, ఈఎంఐలతో ఫెస్టివల్ లోన్...

బ్యాంకులు ఆఫర్లు ఇస్తున్నాయి కదా.. చేతిలో  క్రెడిట్ కార్డు ఎలాగు ఉంది.. ఏదో ఒకటి కొనేస్తే పోతుంది అని చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ ఈ లోన్ తీసుకునే ముందు కాస్త జాగ్రత్త వహించాలి. ఒక్కో ప్రొడక్ట్ కి ఓక్కో ధర ఉంటుంది. ఫెస్టివల్ లోన్ కొంత పరిమితి వరకే ఇస్తారన్న విషయం కూడా గ్రహించాలి. సాధారణంగా ఈఎంఐ విధానంలో ఏదైనా వస్తువు కొంటే.. ఒక నెల ఈఎంఐ చెల్లించకపోయినా ప్రాబ్లం వస్తుంది. పెనాల్టీ విధిస్తారు. అయితే.. ఈ ఫెస్టివల్ లోన్ విషయంలో మాత్రం పెనాల్టీ కాస్త తక్కువగానే ఉంటుంది.

పండగ ఆఫర్ లో తక్కువగా వచ్చేసిందే అనుకుంటాం. కానీ.. మనకు తెలియకుండా  అదనపు ఛార్జీలను అందులో కలిపేస్తుంటారు.

వడ్డీ రేటు..

పర్సనల్ లోన్ వడ్డీ రేటు సంవత్సరానికి 16శాతం నుంచి 24శాతం వరకు ఉంటుంది. అదే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ విధానంలో అయితే 18శాతం నుంచి 24శాతం వరకు ఉంటుంది. అదే ఫెస్టివల్ సీజన్ లో లోన్ తీసుకుంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.

ఛార్జెస్ కంపారిజన్..

పర్సనల్ లోన్ అప్లై చేసినప్పుడు దానిని ప్రాసెసింగ్ కి ఎక్కవ ఖర్చే అవుతుంది. మీరు తీసుకున్న రుణానికి 3శాతం వరకు ఉంటుంది. క్రెడిట్ కార్డు ఈఎంఐ లతో అయితే 2శాతం ఉంటుంది. కానీ ఫెస్టివల్ లోన్ లో మాత్రం 1 శాతం ఉంటుంది.

  పండగ సందర్భంగా బోనస్‌ వస్తుందనో, మరేదో మార్గంలో సొమ్ము వస్తుందనో పెద్ద మొత్తంలో కార్డు ద్వారా ఎక్కువ శాతం మంది కొనుగోలు చేస్తుంటారు. ఈ అంచనాలు నిజం కాకపోతే బిల్లులో 5 నుంచి 10 శాతం కనీస మొత్తం చెల్లించి తాత్కాలికంగా గండం గట్టెక్కిందనుకుంటారు. ముందు ముందు గండాలకు ఇదే ఆరంభం కావచ్చని వూహించరు. కనీస మొత్తం చెల్లించిన తర్వాత మిగిలిన బిల్లుపై 24 నుంచి 50 శాతం వరకూ వడ్డీ పడుతుంది. అప్పటి నుంచి కార్డు ద్వారా కొన్న ప్రతి రూపాయిపైనా వడ్డీ లెక్కవేస్తారు. ఇలా కొన్నాళ్లు పోతే కనీస మొత్తం కూడా ఎంతో భారంగా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా వేతనం పొందే ఉద్యోగులకయితే ఫర్వాలేదు. వ్యాపారం, వృత్తి ద్వారా ఉపాధి పొందుతున్న వారి రాబడిలో నిలకడ ఉండదు. 
కనీస మొత్తం కూడా కట్టకపోతే బిల్లు చెల్లించాల్సిన తేదీ దాటిన వెంటనే బకాయీదారుల జాబితాలో చేరుస్తారు. బిల్లు వ్యవధి అయిపోయిందని, ఫలానా తేదీ లోగా బిల్లు కట్టకపోతే కార్డును బ్లాక్ చేస్తామని మెసేజీలు, ఈమెయిళ్లు, ఫోన్‌ కాల్స్‌తో విసిగించేస్తారు.

కాబట్టి.. ఫెస్టివల్ లోనుని ప్రాసెసింగ్ ఛార్జీలు ఏమీ తీసుకోకుండా చేస్తామని బ్యాంకులు ఆఫర్ చేస్తే.. వెంటనే ఒకే చేయకుండా ఇంట్రస్ట్ రేట్ గురించి మీరు పూర్తిగా వారితో చర్చించాలి. ఫెస్టివల్ లోన్ దాదాపు రూ.50వేల వరకు ఇస్తారు. అంతేకాకుండా అది 12 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నిజంగా మీకు లోన్ తీసుకోవడం అవసరం.. ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలి అనుకుంటే.. పర్సనల్ లోన్ ని ఎంచుకోవడం ఉత్తమం

 

అథిల్ శెట్టి, బ్యాంక్ బజార్.కామ్ సీఈవో

Follow Us:
Download App:
  • android
  • ios