క్రికెటర్ రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు
క్రికెటర్ రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు దక్కింది. 19 మంది క్రీడాకారులకు పలు అవార్డులు వచ్చాయి,.క్రికెటర్ జడేజాకు ఈ అవార్డు దక్కింది.
భారత క్రికెటర్ రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు దక్కింది. దేశంలోని 19 మంది క్రీడాకారులకు ఈ అవార్డు దక్కింది. క్రికెట్ లో రవీంద్ర జడేజాను ఈ అవార్డు వరించింది.పారా అథ్లెట్ దీప మాలిక్ కు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు దక్కింది. రెజ్లర్ బజరంగ్ పునియాకు కూడ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వరించింది.
రవీంద్ర జడేజా 156 వన్డేలు,42 టీ 20, 41 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో 2128, టీ 20 ల్లో 135, టెస్టుల్లో 1485 పరుగులు చేశాడు జడేజా.అంతేకాదు వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. 192 వికెట్లు టెస్టుల్లో, 32 వికెట్లు టీ 20 మ్యాచ్ లో తీశాడు.
ఇటీవల ముగిసిన ప్రపంచకప్ సెమీ ఫైనల్లో రవీంద్ర జడేజా భారత్ చివరి వరకు పోరాటం చేశాడు.రెజ్లర్ బజరంగ్ పునియా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు దక్కింది.పారా ఒలంపిక్ సిల్వర్ మెడల్ సాట్ పుట్ విజేత దీప మాలిక్ కు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది.