టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. స్పెషల్ గా డిజైన్ చేయించిన గ్రీన్ కలర్ ఫ్రాక్ ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలో సమంత చాలా సన్నగా కనిపిస్తుంది. క్లీవేజ్ షో కూడా చేసింది. దీంతో అభిమానులు ఆమెని విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు నువ్ వేసుకున్న డ్రెస్ లలో చెత్త డ్రెస్ ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరికొందరు అస్తి పంజరంలా ఉన్నావ్.. కాస్త తిను అంటూ సలహాలు ఇస్తున్నారు. అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన తరువాత సమంతపై అభిమానుల దృష్టి మరింత పెరిగింది. ఆమె కాస్ట్యూమ్స్ ఏమాత్రం తేడాగా ఉన్నా.. వెంటనే ట్రోలింగ్ చేస్తున్నారు.

తాజాగా మరోసారి ట్రోలింగ్ కి బలైంది సామ్. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఓ బేబీ' అనే సినిమాలో నటిస్తోంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.